మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండలంలోని బంగారు కుటుంబాలకు జీవనోపాదులు కల్పించి పేదరికం నుండి బయటపడేందుకు చేయూతనందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలోనీ కళ్యాణ మండపంలో డిఆర్ డి ఎ ఆధ్వర్యంలో పి-4 కార్యక్రమం పై ఏర్పాటుచేసిన కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ ల సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని దిశా నిర్దేశం చేశారు. తొలుత జిల్లా కలెక్టర్ గుడ్లవల్లేరు …
Read More »Tag Archives: machilipatnam
జాతీయ లోక్ అదాలత్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే డిసెంబర్ నెల 13 వ తేదీన రెండవ శనివారం జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు పూర్వపు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అన్ని న్యాయస్థానాల పరిధిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా సివిల్, కాంపౌండబుల్, క్రిమినల్ కేసులతో పాటు అన్ని రకాల కేసులు పరిష్కరిస్తామన్నారు. కావున ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని …
Read More »ఈ నెల 3వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 3వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …
Read More »గిరిజన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయమని కృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు జన జాతీయ గౌరవ దివస్ ఉత్సవాలలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని పి జి ఆర్ ఎస్ హాల్ నందు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ మహనీయుల ఆశయ స్ఫూర్తితో అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ గిరిజన సంక్షేమానికి …
Read More »మత్స్యకారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది..
-మత్స్యకార కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర కానూరు/తాళ్ళపాలెం, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం మంత్రి మచిలీపట్నం మండలంలోని కానూరు, తాళ్లపాలెం గ్రామాలలో మత్స్యకార కుటుంబాలకు మొంథా తుపాను నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. తుపాను సమయంలో ప్రజల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రజల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కానూరులో …
Read More »పవిత్ర స్నానమాచరించే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రంలో పవిత్ర స్నానమాచరించే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో మంత్రి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ వీ. విద్యాసాగర్ నాయుడు, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహీద్ తో కలసి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో …
Read More »రాష్ట్ర అవతరణకు ప్రాణ త్యాగం చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు ప్రాణ త్యాగం చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర కొనియాడారు. శనివారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి రాష్ట్ర మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ వీ.విద్యాసాగర్ నాయుడు, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ , డిఆర్ఓ చంద్రశేఖర రావు తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. …
Read More »దేశంలో అత్యధికంగా పింఛన్లు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
-నెలలో మొదటి తేదీనే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తున్నాం.. -మంత్రి కొల్లు రవీంద్ర పెదపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే అత్యధికంగా పింఛన్లు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, పేదల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం మండలం, పెదపట్నం గ్రామంలో శనివారం ఉదయం మంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. కొన్నేళ్లుగా పక్షవాతం, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన గ్రామానికి చెందిన …
Read More »యానాది కుటుంబాలను దత్తత తీసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర
– పి-4 కార్యక్రమంతో పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుదాం – నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాను – కొల్లు ఫౌండేషన్ ద్వారా విద్య, ఉపాధికి తోడ్పాటు అందిస్తా – పెద్దపట్నంలో యానాది కుటుంబాలతో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అనంతరం పెద్దపట్నంలో నివాసం ఉంటున్న యానాది కుటుంబాలను ప్రభుత్వం ప్రకటించిన పి-4 కార్యక్రమం కింద దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పెన్షన్ల పంపిణీ కోసం వచ్చిన మంత్రి యానాది కుటుంబాల స్థితిగతుల్ని చూసి చలించిపోయారు. స్వాతంత్ర్యం వచ్చి …
Read More »జాతీయ సమైక్యతకు స్ఫూర్తి సర్ధార్ వల్లభాయ్ పటేల్
-ప్రజలంతా జాతీయ ఐక్యతా భావంతో మెలగాలి -31 అక్టోబర్ నుంచి నవంబర్ 25 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమం, మై భారత్ భారత్, కృష్ణా జిల్లా యువజన అధికారి సుంకర రాము మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్ధార్ @ 150 లో భాగంగా దేశవ్యాప్తంగా అతిపెద్ద ప్రచార యాత్ర డిజిటల్ దశను ప్రారంభించటం గర్వంగా ఉందని కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమం, భారత్, జిల్లా యువజన అధికారి సుంకర రాము …
Read More »
Prajavartha Online Telugu News