మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో తుఫాన్ కారణంగా ఈనెల 27 నుండి 29వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలందరూ వారికి కావలసిన మంచినీరు, పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు, రెడీ టు ఈట్ ఆహారం ముందస్తుగానే సమకూర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా తుపాను కారణంగా విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే పవర్ బ్యాంకు, మొబైల్లను పూర్తిస్థాయిలో ఛార్జింగ్ పెట్టుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అలాగే కొవ్వొత్తులు, …
Read More »Tag Archives: machilipatnam
మోoతాతుఫాన్ ముందస్తు జాగ్రత్తలు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు మోoతాతుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టి సమర్థవంతంగా ఎదుర్కునేందుకు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డిఆర్ఓ చంద్రశేఖర రావు, అదనపు ఎస్పీలు వీవీ నాయుడు, సత్యనారాయణలతో కలసి తుఫాను …
Read More »పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థి దశలోనే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాలని పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ఇన్చార్జి ప్రిన్సిపల్ శ్రీ జాలాది సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాలో ఐటీసీ, వావ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థుల నుంచి పాత పుస్తకాలు పేపర్లు సేకరణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు పెంచడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు పిల్లలలో అవగాహన కల్పించడానికి ఐ టి సి, వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ (వావ్) …
Read More »ఆరోగ్యవంతమైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ పెరట్లో మొక్కలు పెంచాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యవంతమైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ పెరట్లో మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్ సతీమణి పృథ్వి కళ్యాణి పిలుపునిచ్చారు. శనివారం ఉదయం నగరంలోని గాంధీనగర్ ఉదయపు నడక మిత్రమండలి భవనంలో ఏపీ యోగాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా తరగతుల్లో జిల్లా కలెక్టర్ సతీమణి కుటుంబ సభ్యులతో కలిసి యోగాసనాలు, ప్రాణాయామాలు చేశారు. అనంతరం వారు యోగా సభ్యులతో కలిసి మంచినీటి సీసాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ …
Read More »ఈ నెల 27, 28, 29 తేదీలలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు దినాలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 27, 28, 29 తేదీలలో జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు దినాలుగా ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. మోంత తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఇతర విద్యాసంస్థలు అన్నింటికి 3 రోజులపాటు సెలవు దినాలుగా ప్రకటించినట్లు జిల్లా …
Read More »రైతులందరూ దాల్వా రెండో పంటకు సాగునీరు అందించాలని కోరుతున్నారు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పెడన నియోజవర్గం లోని బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల రైతుల విజ్ఞప్తి మేరకు దాల్వా పంటకు సాగునీరు అందించే విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని త్వరలో తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం పెడన శాసనసభ్యులు నియోజకవర్గంలోని రైతులు, సాగునీటి సంఘాల అధ్యక్షులతో కలుసుకొని జిల్లా కేంద్రానికి విచ్చేసి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని నగరంలోని వారి ఛాంబర్లో కలిసి పెడన నియోజకవర్గంలోని రైతులందరూ దాల్వా రెండో …
Read More »పేర్ని నానీ.. రెడ్ లైన్ దాటేశావ్… ఇక వదిలిపెట్టం
-బందరు అభివృద్ధి చూసి ఓర్వలేక వ్యక్తిగత విమర్శలు -నాడు ఆర్యశ్యులను వేధించి.. నేడు ఆర్యవైశ్యుల రాగం సిగ్గుచేటు -దశాబ్దాలుగా వ్యాపారం చేసుకునే మా కుటుంబంపై నిందలేస్తే ఊరుకునేది లేదు -బందరు ప్రజలకు అన్యాయం చేయాలని చూసినా, అభివృద్ధి అడ్డుకున్నా చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంలో జరుగుతున్న అభివృద్ధిని, కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక పేర్నినాని ఇష్టమొచ్చినట్లు వాగుతున్నాడని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు …
Read More »ప్రతి నెలలో మూడవ శనివారం ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని శుభ్రం చేస్తాం..
-అధికారులందరూ భాగస్వామ్యం కావాలి.. -జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలలో మూడవ శనివారం ఒక ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శనివారం ఉదయం ఆయన నగరంలోని జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయ ప్రాంగణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించి పరిసరాల పరిశుభ్రత చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని …
Read More »సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. రోడ్డు ప్రమాదాల స్థితిగతులు, రహదారులపై బ్లాక్ స్పాట్లకు తీసుకున్న చర్యలు, డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్ కేసులు, ప్రమాదాల నివారణకు సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తదితర అంశాలపై ఆయన అధికారులతో …
Read More »మాతృత్వ మరణాల నివారణకు వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మాతృత్వ మరణాలు సంభవించకుండా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో వైద్యాధికారులతో సమావేశమై ప్రసూతి మరణాలపై సమీక్షించారు. ఈ క్రమంలో ఆయన జిల్లాకు సంబంధించిన రెండు ప్రసూతి మరణాల కేసులను విచారించి, వారి మరణానికి గల కారణాలను వారికి చికిత్స చేసిన వైద్యులను, ఘటనా వివరాలను బాధితుల బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాతృత్వ మరణాలను …
Read More »
Prajavartha Online Telugu News