Breaking News

Tag Archives: machilipatnam

రహదారులపై పశువులతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం రహదారులపై పశువులతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన గోశాలను సందర్శించి, విధి విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మచిలీపట్నం మున్సిపల్ పరిధిలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న పశువులను నియంత్రించేందుకు గత ఆగస్టు నెలలో పశువుల …

Read More »

మద్యం గురించి వైసీపీ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదం

-ఐదేళ్ల మద్యం స్కాం బయటపడుతుండడంతో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారు -కల్తీ మద్యం బయటపడగానే అరెస్టు చేసి, పార్టీ నుండి సస్పెండ్ చేశాం -తంబల్లపల్లి కల్తీ మద్యం వెనుక ఉన్న మూలాలు అన్నింటినీ బయటకు తీస్తున్నాం -పేద విద్యార్ధులకు మెరుగైన వైద్య విద్య.. పేదలకు నాణ్యమైన వైద్యం మా లక్ష్యం -మెడికల్ కాలేజీల పేరుతో జగన్ రెడ్డి పిచ్చి ప్రేలాపణలు సిగ్గుచేటు -ఎన్ఆర్ఐ, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా ప్రకటించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి -17 మెడికల్ కాలేజీల్లో ఎన్ని పూర్తి చేశావో సమాధానం చెప్పాలి …

Read More »

తీర ప్రాంత భద్రతకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో తీర ప్రాంత భద్రతకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులు ఆదేశించారు. మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో తీర ప్రాంత భద్రత ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని తీరప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామంలో రీ సర్వేనెంబర్ 113లో వర్ల గొంది తిప్ప సముద్రతీర పోలీస్ స్టేషన్ …

Read More »

మత్స్యకారులకు జీవనోపాదులు కల్పించేందుకు సత్వరమే చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 85 లక్షల రూపాయల గ్రీన్ క్లైమేట్ ఫండ్ నిధులతో మత్స్యకారులకు జీవనోపాదులు కల్పించేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో కేంద్ర ప్రభుత్వ గ్రీన్ క్లైమేట్ ఫండ్ నిధులతో చేపట్టే జీవనోపాదుల కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మడఅడవుల పెంపకానికి, జీవనోపాదుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం …

Read More »

ఈ నెల 10, 11 తేదీలలో ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగ్జిబిషన్… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈ నెల 10, 11 తేదీలలో ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎగ్జిబిషన్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ తో కలిసి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, ఎలక్ట్రానిక్ వస్తువుల దుకాణాల యాజమాన్యాలతో సమావేశమై ఆయా తేదీలలో నిర్వహించవలసిన ఎగ్జిబిషన్ కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర …

Read More »

కూచిపూడి గ్రామాన్ని సుందరమైన వారసత్వ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ముమ్మరంగా చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నాట్య కళకు ప్రసిద్ధి చెందిన కూచిపూడి గ్రామాన్ని సుందరమైన వారసత్వ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో మొవ్వ మండలం కూచిపూడి కూచిపూడి గ్రామం అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం కింద మంజూరైన 3 కోట్ల రూపాయలు నిధులతో కూచిపూడి గ్రామాన్ని …

Read More »

కొరమీను చేపల సాగుతో రైతుకు అదనపు ఆదాయం… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయంతో పాటు అనుబంధంగా కొరమీను చేపల సాగు చేయడం వల్ల రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జీవనోపాదుల మెరుగుదలపై జిల్లా కలెక్టర్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ తో కలిసి మంగళవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, పరిశ్రమలు, మత్స్య, పశుసంవర్ధక, సాంఘిక సంక్షేమం, ఎంపీడీవోలు తదితర అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా …

Read More »

గృహ నిర్మాణాల పురోగతిపై నిర్లక్ష్యాన్ని సహించేది లేదు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని గృహ నిర్మాణాల పురోగతిపై నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, నిర్మాణాలను వేగవంతం చేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ తో కలిసి గృహ నిర్మాణ పురోగతిపై ఎంపీడీవోలు, గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లతో మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతి ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి …

Read More »

కలెక్టరేట్లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు

-వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు మంగళవారం ఉదయం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ వాల్మీకి చిత్ర పటానికి పూలమాలను వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ శాఖ జిల్లా అధికారి జి రమేష్, మెప్మా పీడీ సాయిబాబు తదితరులు …

Read More »

నాగవరం గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నాగవరం గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం వేమవరం పంచాయతీ, పెడన నియోజకవర్గం గూడూరు మండలం ముకొల్లు పంచాయతీ సరిహద్దులో ఉన్న నాగవరం గ్రామాన్ని సందర్శించారు. అక్కడి గ్రామ ప్రజలతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగవరం గ్రామస్తులు మాట్లాడుతూ రెండు నియోజకవర్గాలు రెండు మండలాలు రెండు …

Read More »