Breaking News

Tag Archives: machilipatnam

బిల్లుల చెల్లింపుకు తక్షణ చర్యలు తీసుకోవాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి చేసిన పనుల బిల్లుల చెల్లింపుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులతో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్), జిల్లా పరిషత్, జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ), ఎంపీలాడ్స్ తదితర నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతి, బిల్లుల చెల్లింపులపై ఆయన సమీక్షించారు. ఈ …

Read More »

ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి పలువురు ఉద్యోగుల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఉద్యోగులు విన్నవించిన వివిధ సమస్యలను ఆయన ఓపిగ్గా ఆలకించి పరిష్కారంపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో మొత్తం 5 దరఖాస్తులు రాగా, వాటిని సంబంధిత అధికారులకు పంపిస్తున్నామని వాటిని …

Read More »

వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో ప్రభుత్వ వసతి గృహాల్లోనీ విద్యార్థుల సంక్షేమం ఆరోగ్యం తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా జిల్లాలోని 90 ప్రభుత్వ వసతి గృహాల్లో మంచినీటి ఉపరితల జలాశయాలను నెలకోసారి పరిశుభ్రం …

Read More »

ఆక్వా సాగు వైపు దృష్టి సారించేలా రైతులను ప్రోత్సహించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సాంకేతిక పరిజ్ఞానంతో ఆక్వా సాగు వైపు దృష్టి సారించేలా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో ఆక్వా ఎక్స్చేంజ్ –వినూత్న పద్ధతులలో ఆక్వా సాగుపై సంబంధిత అధికారులు, అభ్యుదయ రైతులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాంకేతిక పద్ధతులను అవలంబించి వినూత్న తరహాలో ఆక్వా సాగు చేయడం వలన రైతులకు ఎంతో లాభదాయకమన్నారు. ముఖ్యంగా సాంకేతిక …

Read More »

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై కలెక్టర్లతో మాట్లాడారు. ప్రధానంగా, ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పురోగతి, గ్రామ వార్డు సచివాలయాల విభాగం 3 అంచెల నిర్మాణం, సీజనల్ వ్యాధులు, మందుల పంపిణీ, ఆసుపత్రులలో పారిశుధ్యం, ఆసుపత్రులలో రోగనిర్ధారణ సేవలు, …

Read More »

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా, కమిటీ సభ్యులతో కలిసి ఆయన పౌర హక్కుల రక్షణ చట్టం 1955, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నివారణ చట్టం 1989, మాన్యువల్ స్కావెంజింగ్ చట్టాల …

Read More »

జిల్లాలో ధాన్యం సేకరణ పకడ్బందీగా చేపట్టాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఖరీఫ్ సీజన్ 2025–26 సంవత్సరానికి సంబంధించి ధాన్యం సేకరణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన పెనమలూరు మండలం పోరంకిలోని మూడవ సచివాలయం నుండి వ్యవసాయ, పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో ధాన్యం సేకరణకు చేపట్టవలసిన పటిష్ట చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణ సజావుగా చేపట్టే విధంగా …

Read More »

స్వమిత్వ సర్వే పకడ్బందీగా చేపట్టాలి..

-దావులూరు గ్రామంలో స్వమిత్వ సర్వే పరిశీలించిన జిల్లా కలెక్టర్ దావులూరు(కంకిపాడు), నేటి పత్రిక ప్రజావార్త : ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్వమిత్వ సర్వే పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో స్వమిత్వ సర్వేను పరిశీలించారు. తొలుత ఆయన గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి స్వమిత్వ సర్వేకు సంబంధించిన రిజిస్టర్లు, మ్యాపులను పరిశీలించారు. అనంతరం ఆయన రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో కలిసి గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. గృహాల వద్దకు వెళ్లి …

Read More »

కొరమీను చేపల సాగుతో రైతుకు అదనపు ఆదాయం..

-సాగుకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. -జిల్లా కలెక్టర్ చినమొత్తేవి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయంతో పాటు అనుబంధంగా కొరమీను చేపల సాగుతో రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని, సాగుకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులను కోరారు. బుధవారం ఆయన మొవ్వ మండలం చినముత్తేవి గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, గ్రామానికి చెందిన చిత్తూరి కస్తూరిబాయి 10 సెంట్ల స్థలంలో చేపట్టిన కొరమేను సాగును పరిశీలించారు. ట్యాంకులోని చేప పిల్లలను ఆసక్తిగా పరిశీలించి సాగుకు సంబంధించిన …

Read More »

పి–4 కార్యక్రమంతో అభివృద్ధి పనులు..

-పోరంకిలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పోరంకి, నేటి పత్రిక ప్రజావార్త : పి–4 కార్యక్రమంలో భాగస్వాములై అభివృద్ధి పనులు చేపడుతున్న మార్గదర్శిల కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ పెనమలూరు నియోజకవర్గంలోని పోరంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో నిర్మించిన అదనపు తరగతి గదులు, గ్రంథాలయాన్ని పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడె ప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. సమాజాభివృద్ధికి …

Read More »