Breaking News

రైతులందరూ దాల్వా రెండో పంటకు సాగునీరు అందించాలని కోరుతున్నారు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పెడన నియోజవర్గం లోని బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల రైతుల విజ్ఞప్తి మేరకు దాల్వా పంటకు సాగునీరు అందించే విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని త్వరలో తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు.

బుధవారం మధ్యాహ్నం పెడన శాసనసభ్యులు నియోజకవర్గంలోని రైతులు, సాగునీటి సంఘాల అధ్యక్షులతో కలుసుకొని జిల్లా కేంద్రానికి విచ్చేసి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని నగరంలోని వారి ఛాంబర్లో కలిసి పెడన నియోజకవర్గంలోని రైతులందరూ దాల్వా రెండో పంటకు సాగునీరు అందించాలని కోరుతున్నారని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు.

తదనంతరం శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ ఇరువురు జిల్లా కలెక్టర్ చాంబర్ కింద ఉన్న పోర్టికోలో వేచి ఉన్న పెడన నియోజకవర్గ రైతుల వద్దకు వచ్చి మాట్లాడారు. బాల్వా రెండో పంటకు సాగునీరు అందించే విషయమై శాసనసభ్యులు రైతులందరి సమక్షంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.

తదుపరి శాసనసభ్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతులు రెండో పంట దాల్వా పంటకు సాగునీరు అందించాలని కోరుతున్నారన్నారు. నియోజకవర్గం జిల్లాలో శివారు ప్రాంతమని, సముద్రానికి ఆనుకుని ఉన్న ప్రాంతం అన్నారు. బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల రైతులు రెండో పంట లేకపోతే అక్కడ మినుములు కూడా పండించే పరిస్థితి లేదన్నారు. సముద్రం దగ్గర ఉండటం వలన అక్కడి భూముల్లో ఉప్పునీరు ఎక్కువగా ఉంటుందన్నారు.
రెండో పంట వేయకపోతే భూములన్ని పాడైపోయే పరిస్థితి ఉందన్నారు. అందువలన రైతాంగం రెండో పంట కావాలని కోరుతున్నారన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందజేశామన్నారు. జిల్లా కలెక్టర్ దాల్వ పంటకు సాగునీరు అందించే అంశాన్ని పరిశీలించి మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లి త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు.
తాను కూడా ఈ సమస్యను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతోపాటు రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకుని వెళ్లి తప్పకుండా దాల్వా పంటకు సాగునీరు అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *