Breaking News

కీ.శే SR శంకరన్ 91వ జన్మదిన వేడుకలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కీ.శే SR శంకరన్ 91 వ జన్మదిన వేడుకలు బుధవారం ఆంధ్ర లయోలా కళాశాల ప్రాంగణంలో SR SANKARAN MEMORIAL TRUST ఆధ్వర్యంలో నిర్వహింపబడ్డాయి. దీప ప్రజ్వలన అనంతరం Fr.ప్రభు Fr.కిరణ్ కుమార్ స్వాగత వచనాలతో కార్యక్రమం ఆరంభమైంది. ముఖ్య అతిథిగా కేరళ మాజీ ప్రధాన ముఖ్య కార్యదర్శి యస్.యమ్.విజయానంద్, శంకరన్ తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఒక కర్మయోగి అని కొనియాడారు. శంకరన్ పారిశుధ్య కార్మికులు,గిరిజనులు కోసం వెట్టి చాకిరీ నిర్మూలన కోసం చేసిన నిరంతర కృషిని వివరించారు. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన స్వేచ్ఛ, సమానత్వం,సౌభ్రాతృత్వం ఆశయాలను ఆచరణలో పూర్తిగా ఆచరణలో ఉంచారన్నారు. ప్రభుత్వంలో పనిచేసే ఏ స్థాయిలోని అధికారికైనా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నించే వారికైనా శంకరన్ జీవితంలో పాఠ్యగ్రంధం అని అన్నారు. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు హరగోపాల్ గారు మాట్లాడుతూ శంకరన్ ఆచరించిన మానవతా విలువలు,నిరాడంబర జీవన విధానం ప్రజలందరూ ఆయనను మరువలేని మనిషిని చేసాయన్నారు. శంకరన్ విధానాలపై పరిశోధన చేసిన డా.సౌజన్య, రాజ్యాంగ పరిధిలో దళితులకు,గిరిజనులకు చేసిన సంస్కరణల సేవ అసమానం, అపురూపం అన్నారు.

కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయకుమార్, నరేంద్ర కుమార్ కూడా పాల్గొని శంకరన్ నిరాడంబరతో కూడిన నాయకత్వ లక్షణాలను కొనియాడారు. కార్యక్రమ ఆరంభంలో శంకరన్ స్మారక సంస్థ కార్యదర్శి డి. చక్రపాణి మాట్లాడుతూ శంకరన్ చేసిన అత్యంత విశిష్టమైన సేవలు ,మానవీయ కోణంలో నిర్వహించిన పదవీ బాధ్యతల గొప్పతనం దృష్టిలో ఉంచుకుని భావి తరాలకు ఆదర్శవంతమైన మార్గ దర్శనం నిమిత్తం ప్రతి సంవత్సరం శంకరన్ జన్మదిన వేడుకల నిర్వహణ తలపెట్టామని అన్మారు మొవ్వ శ్రీనివాస రెడ్డి వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *