Breaking News

కోటి దాటిన యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు

-13 జిల్లాల్లో వంద శాతం దాటిన రిజిస్ట్రేష‌న్లు
-రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ వెల్లడి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
యోగాంధ్ర-2026 రిజిస్ట్రేషన్ల లక్ష్యంలో 96.82% వృద్ధి నమోదైంది. 1,04,93,947 లక్ష్యం కాగా గురువారం సాయంత్రం నాటికి 1,01,60,652 రిజిస్ట్రేషన్లు జరిగాయి. 28కి 13 జిల్లాల్లో నూరు శాతానికి మించి రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం ఓ ప్రకటన జారీచేశారు. దీనికిముందు సచివాలయంలో ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, ఇతర అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఈ నెల 21న నిర్వహించనున్న యోగాసన కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష జరిపారు అధికారులు ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి మంత్రికి నివేదించారు

2 రోజుల ముందుగానే..

అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాలను ప్రతిష్టాకరంగా తీసుకుని ఈ నెల 7 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 21న రాష్ట్రంలోని 28 జిల్లాల్లో జరిగే యోగాసన కార్యక్రమాల్లో 1,04,93,947 మందిని భాగస్వాములను చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాల్లోని జ‌నభా ప్రాతిప‌దిక‌న ల‌క్ష్యాన్ని నిర్దేశించారు. దీనికి అనుగుణంగా యోగాంధ్ర పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. రిజిస్ట్రేషన్ల నమోదులో జిల్లాల అధికారులు ప్రత్యేక శ్రద్ధకనబరిచారు. రాష్ట్ర స్థాయిలో మంగళగిరిలోని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పడిన వార్ రూం ద్వారా నిత్యం పర్యవేక్షణ కొనసాగుతోంది. ఈ నెల 20వ తేదీనాటికి రిజిస్ట్రేషన్లు ముగియాల్సి ఉంది. అయితే గురువారం నాటికే 1,01,60,652 రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం.

విజయనగరం జిల్లా టాప్

ఈ క్రమంలో విజయనగరం జిల్లాలో 107.57%, చిత్తూరు-104.75%, పశ్చిమ గోదావరి-104.48%, ఏలూరు-104.13%, మార్కాపురం జిల్లాలో 104.09% చొప్పున రిజిస్ట్రేషన్లు జరిగాయి. కాకినాడ, అనకాపల్లి, అనంతపురం, గుంటూరు, నంద్యాల, పార్వతీపురం మ‌న్యం, ప్రకాశం, శ్రీసత్యసాయి, విశాఖ జిల్లాల్లో కూడా రిజిస్ట్రేషన్లు వంద శాతం దాటాయి. అల్లూరి సీతారామరాజులో 99.50%, పోలవరం-98.30%, కర్నూలు-96.22%, శ్రీకాకుళం జిల్లాలో 95.75% చొప్పున రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. శుక్రవారంనాటికి మరికొన్ని జిల్లాల్లో వంద శాతం వరకు రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మాస్టర్ ట్రైనర్స్ ప్రోగ్రాం కింద 5,600 మందికి శిక్షణ ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్ష్యాన్ని మించి రికార్డు స్థాయిలో 7,754 మంది ట్రైనర్లు పేర్లు నమోదుచేసుకుని, శిక్షణ పొందారు. మండల స్థాయిలో ట్రైనర్స్ ట్రైనింగ్ కేటగిరిలో ఈ నెల 7 నుంచి జూన్ 11వ తేదీ వరకు 2.5 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ల‌క్ష్యాన్ని కూడా అధిగ‌మించి 2,60,381 మందికి శిక్షణ ఇచ్చారు. పోలవరం, మార్కాపురం, పశ్చిమగోదావరి జిల్లాలు ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *