Breaking News

ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. మరో వారంరోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖలో స్థితిగతులపై చర్చించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారులతో రివ్యూ చేశారు. కేంద్రంలోని ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర పథకాలకు సంబంధించి అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించి…సకాలంలో నిధులు విడుదల అయ్యేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. కేంద్ర పథకాలకు సంబంధించి 5 శాఖల నిధులు రావాల్సి ఉందని అధికారులు తెలపగా….. కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆర్థిక సంవత్సరం ముగింపులోగా నిధులు తెచ్చుకోవాలని తెలిపారు. హైదరాబాద్ లోని సిఎం నివాసంలో జరిగిన ఈ రివ్యూకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ సెక్రటరీ రోనాల్డ్ రోస్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్, సిఎంవో అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *