Breaking News

కుల మ‌తాల‌కు అతీతంగా స‌మాజం ఎద‌గాలి

-అవినీతి ర‌హిత స‌మాజ‌మే గాంధీజీ కి ఘ‌న నివాళి.
-మ‌హాత్మా గాంధీ వ‌ర్ధంతి వేడుక‌ల్లో ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి

విజ‌యవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గాంధీ హిల్ ఫౌండేష‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో మ‌హాత్మా గాంధీ 78 వ వ‌ర్ధంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. పాత‌బ‌స్తీలోని గాంధీ హిల్ పై నూత‌నంగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్ర‌హాన్ని పశ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి ఆవిష్క‌రించారు. అనంత‌రం కొండ పై ఉన్న గాంధీ స్థూపం వ‌ద్ద శ్ర‌ద్దాంజ‌లి ఘ‌టించారు. అనంత‌రం వ‌ర్ధంతి స‌భ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్య‌మంలో గాంధీజీ పాత్ర మ‌రువ‌రానిది అన్నారు. 1921 మార్చి 31 న గాంధీజీ సంద‌ర్శించిన ఈ ప్రాంతం గాంధీ హిల్ గా చ‌రిత్ర‌లోకి వెళ్ల‌డం ఈ ప్రాంత వాసుల అద్రుష్ణంగా పేర్కొన్నారు. గాంధీజీ బోధించిన‌ సత్యం..అహింసా మార్గం దేశ ప్ర‌జ‌ల‌కు ఆచరణీయం అన్నారు. భ‌ర‌త జాతికి అనేక విలువలకు దశ, దిశా నిర్దేశించిన మ‌హ‌నీయుడు బాపూజీ అని కొనియాడారు. గాంధీజీ సిద్దాంతాల‌ను మన దేశం కంటే పొరుగు దేశాలు బాగా ఆచ‌రిస్తున్నాయ‌న్నారు. ప్రతి ఒక్కరు కష్టపడాలి, వాళ్ల కళ్ళ మీద నిలబడాలి.. అవినీతి లేకుండా చూడాలి అనే సిద్దాంతాల‌ను సింగపూర్ వంటి దేశం తూచా త‌ప్ప కుండా పాటించ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. ఇప్ప‌టికీ మన దేశంలో అతి పెద్ద సమస్య అవినీతి అని దానిని పార‌ద్రోలేంద‌కు స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రూ క్రిషి చేయాల‌ని పిలుపునిచ్చారు. గాంధీజీ స్వాతంత్రం తెచ్చిందే కులాలు , మతాలు అతీతంగా సమాజం లో ఎదగాలి అనే ఉద్దేశ్యంతో కాబ‌ట్టి మానవత్వమే అందరి కీ ఆచరణీయం అన్నారు. గాంధీజీ సంద‌ర్శించిన ఈ ప్రాంతాన్ని టూరిజం కేంద్రంగా అభివ్రుద్ది ప‌ర్చ‌డంతో పాటు ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తేవడానికి ఎల్లపుడు ఫౌండేష‌న్ కు స‌హ‌క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు. కార్య‌క్ర‌మంలో గాంధీహిల్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ , ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేపీసీ గాంధీ , జాయింట్ సెక్ర‌ట‌రీ శార‌ద‌, స‌భ్యురాలు ర‌ష్మి, సిద్దార్ధ లా క‌ళాశాల ప్రిన్సిప‌ల్ చెన్నుపాటి దివాక‌ర్ బాబు, మాజీ మేయ‌ర్ జంధ్యాల శంక‌ర్, మాజీ ఐఏఎస్ ద‌మ‌యంతి , గాంధీ స్మార‌క నిధి కోశాధికారి డోగిప‌ర్తి శంక‌రరావు. ఎఫ్ట్రానిక్స్ చైర్మ‌న్ దాసరి రామ‌క్రిష్ణ, దూదేకుల కార్పొరేష‌న్ చైర్న్ నాగుల్ మీరా త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *