Breaking News

శాఖధిపతులు స్వయంగా ప్రజల ఫిర్యాదులను పరిశీలించాలి…

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు శాశ్వతమైన పరిష్కారాలు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ప్రధాన కార్యాలయం తో పాటు జోనల్ కార్యాలయాల్లో జరిగే ప్రజా ఫిర్యాదులను పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షిస్తూ మూడు కార్యాలయాల అధికారులతో గతవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పరిష్కరించిన దరఖాస్తులపై సమీక్షించారు.

మున్సిపల్ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పురమిత్ర యాప్ లో స్వీకరించిన ఫిర్యాదులను, అధికారులు పరిష్కరించిన తీరును సమీక్షించారు. ఎప్పటికప్పుడు పురమిత్ర ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కరించిన ప్రతి ఫిర్యాదులో నాణ్యమైన, శాశ్వతమైన పరిష్కారం అందించాలని, ప్రజలకు పరిష్కారం చూపించాలే తప్ప వేరే శాఖపై సమస్యను మళ్లించకూడదని అధికారులను హెచ్చరించారు. శాఖలన్నీ సమన్వయంతో పని చేయాలని వచ్చిన ప్రతి ఫిర్యాదు శాఖల సమన్వయంతో పరిష్కరించాలని కమిషనర్ అన్నారు.

ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు తీసుకువచ్చిన ఫిర్యాదులను, శాఖధిపతులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారులకు తమ స్వయంగా వచ్చి పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకొచ్చే విధంగా చూస్తామని తెలియపరిచారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 20 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 7, ఇంజనీరింగ్ 6, రెవిన్యూ 4, పబ్లిక్ హెల్త్ 2, హౌసింగ్ 1 మొత్తం కలిపి 20 ఫిర్యాదులను అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే.అర్జునరావు, చీఫ్ సిటీ ప్లానర్ కె.సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి. సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, సూపరిండెంటింగ్ ఇంజనీర్ (వర్క్స్) వి.చంద్రశేఖర్, అకౌంట్స్ ఆఫీసర్ బి. సత్యనారాయణమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు గోపాలకృష్ణ, ప్రభాకర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి. హరీష్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *