-గుంటూరులో ప్రదానం చేయనున్న వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
2025 సంవత్సరానికి గాను నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలందిస్తున్న ఐదుగురికి ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ అవార్డుల్ని ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ‘ఇంటర్నేషనల్ నర్సెస్ డే’ సందర్భంగా ఈ ఐదుగురికి గుంటూరులో మంగళవారంనాడు వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రదానం చేయనున్నారు. పరిశోధన, బోధన, రోగుల సేవ, ఇతర కేటగిరీల పనితీరులో వీరు ఉత్తమ పనితీరు కనబరిచారని అధికారులు తెలిపారు.
అవార్డు గ్రహీతలు వీరే
డాక్టర్ బి.వనజ కుమారి (ప్రిన్సిపాల్, నారాయణ నర్సింగ్ కాలేజీ, నెల్లూరు)కి బెస్ట్ నర్స్ రీసెర్చర్, డాక్టర్ సి.ఆర్.సంషేర్ బేగం (ప్రిన్సిపాల్, మిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, విజయనగరం)కు బెస్ట్ నర్స్ అడ్మినిస్ట్రేటర్, డాక్టర్ కె.సుగంతి(లెక్చరర్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, మచిలీపట్నం)కు బెస్ట్ నర్స్ ఎడ్యుకేటర్,
ఎస్. చిన్నమ్మి(హెడ్ నర్స్, సిహెచ్‌సి, బుడితి, శ్రీకాకుళం జిల్లా)కు బెస్ట్ నర్సింగ్ సర్వీసెస్, కె.సావిత్రి(ఎన్ఎన్ఎం, పిహెచ్‌సి, చుక్కలూరు, అనంతపురం జిల్లా)కు క్యాటగిరీ ఆఫ్ బెస్ట్ ఎఎన్ఎం అవార్డుల్ని ప్రదానం చేస్తారు.
Prajavartha Online Telugu News