-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున విజయవాడ నగరపాలక సంస్థ ప్రజల కోసం రక్షణ చర్యలు తీసుకుంటుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్డు, అతారత్తయ్య వీధి, సాంబమూర్తి రోడ్డు, కోనాడా సూర్యప్రకాష్ రోడ్డు, గవర్నర్పేట, దుర్గాపురం, గులాబీ తోట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని నగరపాలక సంస్థ వివిధ రక్షణ చర్యలు చేపడుతుందని అందులో భాగంగా ప్రధాన ట్రాఫిక్ కూడళ్ళో నీడను ఏర్పాటు చేయడమే కాకుండా అన్నా క్యాంటీన్లలో కూడా క్యూ లైన్ ల వద్ద నీడను ఏర్పాటు చేశామని అన్నారు. నగరంలో గల మినీ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో ఉన్న కాంపాక్టర్ బిన్ లలో ఎటువంటి మరమ్మతులు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటిని మరమ్మతులు చేస్తూ వ్యర్థ సేకరణలో ఎటువంటి లోపం లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు. నగరాన్ని అందంగా ఉంచేందుకు నూతనంగా వాల్ పెయింటింగ్ లు, మ్యూరల్ ఆర్ట్స్ వేయించమని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా ఈ పెయింటింగ్ లు నగరానికి అందంగా మాత్రమే కాకుండా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చిత్రాలు ఉండాలని అన్నారు. తదుపరి రాణి గారి తోట వద్ద గల అన్న క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్న క్యాంటీన్లో వచ్చే ప్రజలకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో క్యూ లైన్లు వద్ద నీడ ఉండేటట్టు చర్యలు తీసుకోమని అధికారులకు గతంలో ఆదేశించగా గులాబీ తోట అన్న క్యాంటీన్లో ఆ ఏర్పాట్లను పరిశీలించారు. అన్న క్యాంటీన్లో ఎటువంటి వసతులు కావాలన్నా సందేహం లేకుండా వెంటనే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలని ప్రజలకు ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవాలని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరమతులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News