Breaking News

రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎలక్ట్రోల్ మ్యాపింగ్ 95 గుంటూరు తూర్పు, 94 పశ్చిమ నియోజకవర్గాల్లో 61 శాతంకి పైగా మ్యాపింగ్ జరిగిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఏఈఆర్ఓ, డిప్యూటీ కమిషనర్ సిహెచ్. శ్రీనివాస్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. బుధవారం నగర కమిషనర్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె. మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి ప్రధాన కార్యాలయంలోని అదనపు కమిషనర్ చాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవల్ ఏజంట్లను నియమించుకొని వివరాలను తమకు అందించాలని కోరారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై జరిగే సర్వేని రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పరిశీలించి, సర్వే వేగవంతానికి సహకరించాలన్నారు. రాజకీయ పార్టీల సమావేశాల్లో కూడా ఈ జనగణన గురించి కార్యకర్తలకు, ప్రజలకు తెలిపి వారి వివరాలను జనగణన చేసే ప్రతినిధులకు అందజేయాలని తెలియచేశారు.
సమావేశంలో డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాస్ రావు, త్రినాద్ (జనసేన), డి.జాన్ బాబు (వైఎస్ఆర్సీపీ), సిహెచ్.వాసు (బిఎస్పీ), ఎస్. కార్తీక్ (సిపిఐ), ఎస్ డి జాని బాషా (కాంగ్రెస్), ఎలక్షన్ సూపరింటెండెంట్ బాలాజీ బాషా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *