Breaking News

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భరోసా

-ప్రభుత్వ పాఠశాలల్లో 580పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య
-నియోజకవర్గవ్యాప్తంగా 31 మంది గుర్తింపు
-విద్యార్థుల ఆసక్తికి తగిన విధంగా కోర్సుల ఎంపిక
-ఉప ముఖ్యమంత్రి చొరవతో ముందుకు వచ్చిన విద్యా సంస్థలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దే క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలో విద్యార్థులకు ఆయన వరాలు కురిపిస్తున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులు లేని భగవంతుని పిల్లలకు నెలనెలా తన జీతాన్ని రూ. 5,000 చొప్పున నెలవారీ సాయం కింద అందిస్తున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు వారి అభిరుచికి అనుగుణంగా ఉచితంగా ఉన్నత విద్యాభ్యాసం చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు.  పవన్ కళ్యాణ్ నుంచి రూ. 5 వేల సాయం అందుకుంటున్న వారిలో ఏడుగురు విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించారు. వీరితోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 31 మంది 580 మార్కును దాటారు. ఈ విద్యార్థులలో 598 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన ఒక విద్యార్థి కూడా ఉన్నారు. వీరందరి ప్రతిభకు తనవంతు ప్రోత్సాహకంగా పై చదువులకు సాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి, వారి ఆసక్తికి అనుగుణంగా కోర్సులు, కళాశాలలు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆయా కళాశాలల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి ఆ 31 మందికి ఉచిత విద్య ఏర్పాటు చేశారు. తన నిర్ణయాన్ని గౌరవించి, అడిగిన వెంటనే పిఠాపురం విద్యార్ధులకు అడ్మిషన్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన విద్యాసంస్థలకు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని… ఉత్తమంగా రాణించాలని విద్యార్థులకు శుభాశీస్సులు
అందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *