Breaking News

దివ్యాంగుల జాతీయ స్థాయి సిట్టింగ్ వాలీబాల్ పోటీల్లో ఏపీ ఘనత.. విజేతలను అభినందించిన మంత్రి కందుల దుర్గేష్

-సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన దివ్యాంగుల సిట్టింగ్ వాలీబాల్ జాతీయ స్థాయి టీం
-ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో ఫిబ్రవరి 25 నుండి 28వ తేదీ వరకు జరిగిన దివ్యాంగుల సిట్టింగ్ వాలీబాల్ జాతీయ స్థాయి పోటీల్లో స్వర్ణం సాధించిన పురుషుల జట్టు
-ఆంధ్రప్రదేశ్ పురుషులు మరియు మహిళల జట్లను సత్కరించి, అభినందించిన మంత్రి కందుల దుర్గేష్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో ఫిబ్రవరి 25 నుండి 28వ తేదీ వరకు జరిగిన దివ్యాంగుల సిట్టింగ్ వాలీబాల్ జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ పురుషుల జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో సంబంధిత టీం మంత్రి కందుల దుర్గేష్ ను వెలగపూడి సచివాలయం రెండవ బ్లాక్ లోని పేషీలో గురువారం కలిసింది. పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PVAAP )వారి ఆధ్వర్యంలో 5 సంవత్సరాల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఛాంపియన్ షిప్ గా నిలిచిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పురుషులు మరియు మహిళల జట్లను మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. PVAAP ప్రెసిడెంట్ బోడపాటి శివదత్ ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వైకల్యాన్ని జయించి, క్రీడల్లో రాణిస్తూ రాష్ట్ర కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేస్తున్న క్రీడాకారుల కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని మంత్రి కొనియాడారు.

ఈ కార్యక్రమంలో పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బోడపాటి శివదత్, ఇతర అసోసియేషన్ సభ్యులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. మంత్రి దుర్గేష్ తమను వెన్నుతట్టి ప్రోత్సహించినందుకు శివదత్ కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *