Breaking News

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన 1386 వ (49వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు  కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు.

పరిశ్రమలు & వాణిజ్య శాఖ…

1. పరిశ్రమలు & వాణిజ్యం:
ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు (MSMEs) ఈక్విటీ మరియు ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా, ఆంధ్రప్రదేశ్ SME ఎక్స్ఛేంజ్ (APSMEX) ప్రారంభానికి చర్యలు చేపట్టేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

అదేవిధంగా, APSMEX స్థాపన కోసం రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు కూడా సమ్మతి తెలిపింది. ఈ టాస్క్ ఫోర్స్ APSMEX రూపకల్పన, సంబంధిత వర్గాలతో సంప్రదింపులు, రెగ్యులేటరీ సంస్థలతో సమన్వయం వంటి అంశాలను నిర్వహించి, అమలు విధానానికి సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను రూపొందించి సంబంధిత అధికారుల ఆమోదానికి సమర్పించనుంది.

2. పరిశ్రమలు & వాణిజ్యం:
కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలోని Orvakal Mega Industrial Hub (OMIH), గుత్తపాడులో 47.65 ఎకరాల భూమిని కేటాయించేందుకు, అలాగే AP ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ (4.0) 2024–2029 కింద ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి SIPB సిఫార్సు మేరకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఈ భూమిపై M/s Gridon Energy Private Limited 3 GW సామర్థ్యంతో సోలార్ సెల్ మరియు మాడ్యూల్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. రూ.3,149.5 కోట్ల పెట్టుబడితో అమలుకానున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 320 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడనున్నాయి.

3. పరిశ్రమలు & వాణిజ్యం:
చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం చినపందూరు గ్రామంలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న టైరు తయారీ సౌకర్యాన్ని ఫేజ్–IV విస్తరణ చేయడానికి Apollo Tyres Limited కు ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి, SIPB సిఫార్సు మేరకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రూ.6,100 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ విస్తరణ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 1,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడనున్నాయి.

4. పరిశ్రమలు & వాణిజ్యం:
నెల్లూరు జిల్లాలోని IFFCO Kisan SEZలో గ్రీన్‌ఫీల్డ్ ఎంజైమ్ తయారీ సౌకర్యాన్ని స్థాపించేందుకు International Food and Fragrance India Private Limited కు ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి, SIPB సిఫార్సు మేరకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రూ.3,153 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 172 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడనున్నాయి.

5. పరిశ్రమలు & వాణిజ్యం:
తిరుపతి జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ మోటర్‌సైకిల్ తయారీ కర్మాగారం స్థాపించడానికి Royal Enfield (Eicher Motors Limited)కు ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి SIPB సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. ఈ బ్రాండ్ విలువను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పరిశీలన జరిగింది. INR 2,508 కోట్ల పెట్టుబడి మరియు 3,000 మంది ఉద్యోగాల కల్పన సామర్థ్యం ఉంది.

6. పరిశ్రమలు & వాణిజ్యం:
పాల్నాడు జిల్లా దాచేపల్లి (M), పేడగర్లపాడు మరియు కాసనుపల్లి గ్రామాల్లో వేస్ట్-హీట్ ఆధారిత పవర్ జెనరేషన్ సహా ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్ విస్తరణకు M/s చెట్టినాడ్ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి SIPB సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. INR 1,340 కోట్ల పెట్టుబడి మరియు 360 మంది ఉద్యోగాల కల్పన సామర్థ్యం ఉంది.

7. పరిశ్రమలు & వాణిజ్యం:
ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్ (CFE) పొందే గడువును 6 నెలలు పొడిగించడానికి SIPB సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం కేటగిరీ-I ప్రాజెక్టులు పాలసీ నోటిఫికేషన్ తేదీ నుండి 24 నెలల్లో (అక్టోబర్ 25, 2026 వరకు), కేటగిరీ-II కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టులు 30 నెలల్లో (ఫిబ్రవరి 25, 2027 వరకు) CFE పొందాలి.

8. పరిశ్రమలు & వాణిజ్యం:
M/s AAK సౌత్ ఈస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, M/s ITC లిమిటెడ్ మరియు M/s హాంగ్యో ఐస్ క్రీమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ — ఈ మూడు కంపెనీలకు APIDP 4.0 కింద క్యాపిటల్ సబ్సిడీ మరియు అన్ని ఇతర ప్రోత్సాహకాలతో సహా ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి SIPB సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది.

9. పరిశ్రమలు & వాణిజ్యం:
M/s NAN Greenmet Private Limited ప్రాజెక్ట్ విషయంలో SIPB సిఫార్సుల మేరకు, జి.ఓ.ఎం.ఎస్.నం.31, పరిశ్రమలు & వాణిజ్య (P&I) శాఖ, తేదీ 27.02.2026కు సవరణలు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సవరణల ప్రకారం అమలు సంస్థ మార్పు, దశల వారీ అమలు విధానం, అలాగే DCP నుండి 10 సంవత్సరాల పాటు యూనిట్‌కు రూ.1.50 పవర్ టారిఫ్ రీయింబర్స్‌మెంట్ (మొత్తం రూ.134 కోట్ల పరిమితిలో) వోల్టేజ్ స్థాయితో సంబంధం లేకుండా వర్తించనున్నాయి. అదేవిధంగా, AP సర్క్యులర్ ఎకానమీ అండ్ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ (4.0) 2025–30 నిబంధనల మేరకు సంబంధిత మార్పులను అమలు చేయనున్నట్లు ఆమోదం తెలిపింది.

10. పరిశ్రమలు & వాణిజ్యం:
Dallas Technology Center LLP కు అదనంగా 2,270.88 చదరపు మీటర్ల విస్తీర్ణానికి పొసెషన్ సర్టిఫికేట్ జారీ చేయడానికి, SIPB సిఫార్సు మేరకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. MAUD శాఖ నుండి సెట్‌బ్యాక్ మినహాయింపు లభించిన నేపథ్యంలో, ఈ అదనపు విస్తీర్ణానికి సంబంధించి అదనపు భూమి ధర వసూలు చేయబడదని నిర్ణయించింది.

11. పరిశ్రమలు & వాణిజ్యం:
SIPB సిఫార్సుల మేరకు రెండు కంపెనీలతో కుదుర్చుకున్న సేల్ అగ్రిమెంట్‌లలో నిబంధనల సవరణలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
(i) Skyroot Aerospace Private Limited విషయంలో, సేల్ అగ్రిమెంట్‌లో ఉన్న పెరిగిన పరిహారం (Enhanced Compensation) మరియు అదనపు చార్జీలకు సంబంధించిన నిబంధనను తొలగిస్తూ, సంస్థ బాధ్యత కేవలం సేల్ కన్సిడరేషన్ చెల్లింపుకే పరిమితమని స్పష్టత ఇచ్చింది.
(ii) Ethereal Exploration Guild Private Limited విషయంలో, భూమి సేకరణ ఖర్చుల నుండి ఉత్పన్నమయ్యే అభివృద్ధి చార్జీలు మరియు పెరిగిన పరిహారం బాధ్యతను ఎకరాకు గరిష్టంగా రూ.2.00 లక్షల వరకు పరిమితం చేయడానికి ఆమోదం తెలిపింది.

పరిశ్రమలు & వాణిజ్య (ఆహార ప్రాసెసింగ్) శాఖ….

12. పరిశ్రమలు & వాణిజ్యం (ఆహార ప్రాసెసింగ్):
అనంతపురం మరియు అన్నమయ్య జిల్లాల్లో నాలుగు బ్రాయిలర్ బ్రీడర్ ఫార్మ్‌లు మరియు ఒక హేచరీ స్థాపనకు సంబంధించి Sneha Farms Private Limited కు వర్తించే పాలసీల కింద ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీని విస్తరించేందుకు SIPB సిఫార్సు మేరకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రూ.277.94 కోట్ల పెట్టుబడితో అమలుకానున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 435 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడనున్నాయి.

సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ…

13. సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్:
కర్నూలు జిల్లా Uyyalawada Narasimha Reddy Airportలో PPP విధానంలో Operate-Manage-Develop (OMD) మోడల్ ద్వారా కన్సెషనైర్ ఎంపిక కోసం ముసాయిదా RFPకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రీ-బిడ్ సమావేశంలో వచ్చిన సూచనలు మరియు విచారణల ఆధారంగా, APADCLలోని టెక్నికల్ కమిటీకి RFP నిబంధనల్లో అవసరమైన సవరణలు చేయడానికి అనుమతి ఇచ్చింది. బిడ్డింగ్ ప్రక్రియ పూర్తైన అనంతరం, తుది ఆమోదం కోసం ప్రతిపాదనను మళ్లీ మంత్రి మండలి ముందుకు తీసుకురానున్నారు.

14. సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్:
విశాఖపట్నం జిల్లాలో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌తో అనుసంధానంగా గిగాస్కేల్ AI డేటా సెంటర్ (AIDC) ఏర్పాటు చేయడానికి Reliance Industries Limited కు 854.97 ఎకరాల భూమి కేటాయింపుతో పాటు ప్రోత్సాహకాలను విస్తరించేందుకు, SIPB సిఫార్సు మేరకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. విశాఖపట్నం జిల్లాలోని పోలిపల్లి, భోగాపురం ఈస్ట్ మరియు భోగాపురం వెస్ట్ గ్రామాలలో ఈ డేటా సెంటర్ నెలకొల్పబడనుంది. భూమిని 25% రాయితీతో కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే ప్రధాన వాటాదారులు మరియు సంబంధిత ప్రభుత్వ విభాగాల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, SIPB సిఫార్సు చేసిన మేరకు ప్రాజెక్టుకు అనుకూలమైన ప్రోత్సాహకాలను అందించడానికి కూడా మంత్రి మండలి అనుమతి మంజూరు చేసింది. రూ. 1,08,010 కోట్ల భారీ పెట్టుబడితో అమలుకానున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 1,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించబడనున్నాయి. నిర్మాణం, తయారీ మరియు IT సేవలు వంటి రంగాలలో పరోక్ష ఉపాధి కూడా పెద్ద ఎత్తున కల్పించబడనుంది. ఈ డేటా సెంటర్ రాష్ట్ర డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు, AI ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్తుకు అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించనుంది.

15. సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్:
తిరుపతి జిల్లా Sri Cityలో అడ్వాన్స్డ్ ఎయిర్ కండిషనింగ్ మరియు రిఫ్రిజరేషన్ ఉత్పత్తుల తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి Carrier Airconditioning & Refrigeration Limited కు ప్రాజెక్ట్ ఆమోదం మరియు ప్రోత్సాహకాలను విస్తరించేందుకు, SIPB సిఫార్సు మేరకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును AP ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ (4.0) 2024-29 కింద పరిగణనలోకి తీసుకుని, పాలసీ మేరకు ప్రోత్సాహకాలు అందించేందుకు మంత్రి మండలి అనుమతి మంజూరు చేసింది. రూ. 863 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 721 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించబడనున్నాయి.

తిరుపతి జిల్లా ఇప్పటికే HVAC తయారీకి కీలక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది, పలు దేశీయ మరియు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నెలకొల్పాయి. Carrier యూనిట్ చేరికతో భాగాల స్థానికీకరణ మరియు సమీకృత వ్యవస్థల అభివృద్ధి ద్వారా ఈ పారిశ్రామిక వాతావరణం మరింత బలపడనుంది. డేటా సెంటర్లు మరియు క్లిష్టమైన మౌలిక సదుపాయాలకు అధిక సామర్థ్యం గల శీతలీకరణ పరిష్కారాల డిమాండ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని మరింత పటిష్టపరచడంతో పాటు భారతదేశంలో సమగ్ర డేటా సెంటర్ పర్యావరణ వ్యవస్థ నిర్మాణంలో కీలక అడుగుగా నిలవనుంది.

16. సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్:
కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పూర్తి ప్రభుత్వ యాజమాన్య పరిశోధనా సంస్థ Naval Science and Technological Laboratory (NSTL) అభ్యర్థన మేరకు, AP క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025–30 కింద నావల్ అప్లికేషన్ల కోసం అమరావతి క్వాంటమ్ వ్యాలీ (AQV)లో ప్రత్యేక R&D సౌకర్యం స్థాపనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ కేంద్రంలో స్వదేశీ క్వాంటమ్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ (QCFD) అల్గారిథమ్స్‌తో పాటు హైబ్రిడ్ క్లాసికల్–క్వాంటమ్ వర్క్‌ఫ్లోల అభివృద్ధి, వ్యాలిడేషన్ మరియు టెస్టింగ్ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 5,000 చదరపు అడుగుల ప్లగ్-అండ్-ప్లే కార్యాలయ స్థలం కేటాయింపునకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సౌకర్యం స్థాపన వ్యూహాత్మక మరియు రక్షణ అప్లికేషన్లలో భారతదేశ క్వాంటమ్ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. అంతేకాక రక్షణ పరిశోధన మరియు విద్యా సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడంతో పాటు హైబ్రిడ్ క్వాంటమ్-క్లాసికల్ కంప్యూటింగ్‌లో అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైన ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, AP క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ (2025–30) కింద రాష్ట్రాన్ని క్వాంటమ్ టెక్నాలజీ మరియు జాతీయ భద్రతా ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దనుంది.

ఇంధన శాఖ…

17. ఇంధన శాఖ:
M/s యామ్‌నాకో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు తిరుపతి జిల్లా చిల్లకూరు మరియు కోట మండలాల గ్రామాల్లో 89 KTPA గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ మరియు 0.5 MMTPA గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ (దశలవారీగా 1 మిలియన్ వరకు విస్తరించవచ్చు) స్థాపించడానికి మరియు AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ప్రాజెక్ట్ ఆమోదం మరియు ప్రోత్సాహకాలు విస్తరించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

18. ఇంధన శాఖ:
M/s Reliance Industries Limited అభ్యర్థన మేరకు, AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024 కింద నాలుగు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా, శ్రీ సత్యసాయి జిల్లా అమడగురు మండలంలో రెండు దశల్లో 6600 MW AC / 9000 MWp DC సామర్థ్యంతో, 29,000 MWh BESS అనుబంధంగా భారీ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కేటాయింపులు ఇతర డెవలపర్లకు ఇప్పటికే కేటాయించిన పునరుత్పాదక శక్తి సామర్థ్యాలకు భంగం కలగకుండా చేపట్టబడతాయి. మొదటి దశలో 1600 MW AC / 2000 MWp DC సామర్థ్యంతో పాటు 7 GWh BESS ఏర్పాటు చేయనున్నారు.

అలాగే, ప్రాజెక్ట్ పరిధిలోని ప్రైవేట్ భూముల మధ్య అందుబాటులో ఉన్న రెవెన్యూ/కేటాయించిన భూములను ఎకరాకు సంవత్సరానికి రూ.31,000 లీజు రుసుముతో, ప్రతి రెండు సంవత్సరాలకు 5% పెంపుతో కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. అదనంగా, AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024 కింద ప్రాజెక్టుకు వర్తించే ప్రోత్సాహకాలను కూడా విస్తరించేందుకు మంత్రి మండలి సమ్మతి తెలిపింది.

19. ఇంధన శాఖ:
M/s క్లీన్ రీన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద రెండు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది: (i) నంద్యాల జిల్లా అవుకు మండలం సింగనాపల్లె గ్రామంలో ఇప్పటికే నిర్ణయించిన హద్దుల్లో 35 MW AC / 52.50 MWp DC సోలార్ పవర్ ప్రాజెక్ట్ కేటాయింపు; (ii) ప్రైవేట్ భూముల మధ్య అందుబాటులో ఉన్న రెవెన్యూ/కేటాయించిన భూ పాచెస్‌ను ఎకరాకు సంవత్సరానికి రూ.31,000/- చొప్పున ప్రతి రెండు సంవత్సరాలకు 5% పెంపుతో కేటాయించడం.

20. ఇంధన శాఖ:
M/s Clean Renewable Energy Hybrid Thirteen Private Limited అభ్యర్థన మేరకు, AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024 కింద అనంతపురం జిల్లా D.హిరేహాల్ మండలంలోని కడలూరు మరియు హులికల్ గ్రామాల్లో 140.80 MW AC / 211.20 MWp DC సామర్థ్యంతో సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను, ఇతర డెవలపర్లకు ఇప్పటికే కేటాయించిన పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులు మరియు విండ్ రిసోర్స్ అసెస్‌మెంట్ స్టడీస్ ప్రాంతాలతో అతివ్యాప్తి లేకుండా కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.

అదేవిధంగా, ప్రాజెక్ట్ పరిధిలో ప్రైవేట్ భూముల మధ్య అందుబాటులో ఉన్న రెవెన్యూ/కేటాయించిన భూ పాచెస్‌ను, AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024 నిబంధనల ప్రకారం, ఎకరాకు సంవత్సరానికి రూ.31,000 లీజు రుసుముతో, ప్రతి రెండు సంవత్సరాలకు 5% పెంపుతో కేటాయించేందుకు కూడా ఆమోదం తెలిపింది.

21. ఇంధన శాఖ:
M/s క్లీన్ రీన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ ట్వెల్వ్ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద రెండు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది: (i) అనంతపురం జిల్లా D.హిరేహాల్ మండలం కడలూరు & హులికల్ గ్రామాల్లో 140.80 MW AC / 211.20 MWp DC సోలార్ పవర్ ప్రాజెక్ట్ కేటాయింపు — ఇతర డెవలపర్లకు ఇప్పటికే కేటాయించిన పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులు మరియు విండ్ రిసోర్స్ అసెస్‌మెంట్ స్టడీస్ ప్రాంతాలతో అతివ్యాప్తి లేకుండా; (ii) ప్రైవేట్ భూముల మధ్య అందుబాటులో ఉన్న రెవెన్యూ/కేటాయించిన భూ పాచెస్‌ను ఎకరాకు సంవత్సరానికి రూ.31,000/- చొప్పున ప్రతి రెండు సంవత్సరాలకు 5% పెంపుతో కేటాయించడం.

22. ఇంధన శాఖ:
YSR కడప జిల్లాలో M/s Adani Hydro Energy Eleven Limited (AHE11L) అభ్యర్థన మేరకు, AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024 కింద మూడు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా, 2250 MW సామర్థ్యంతో గండికోట–2 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌ను కేటాయించేందుకు సమ్మతి తెలిపింది. ఈ ప్రాజెక్ట్ అమలులో, CEA/MNRE మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే ఉన్న మరియు ప్రతిపాదిత విండ్ & PSP ప్రాజెక్టుల నుండి నిర్దేశిత సురక్షిత దూరం పాటించాల్సి ఉంటుంది.

అలాగే, గండికోట రిజర్వాయర్ నుండి గండికోట–2 PSP కోసం ఒకసారి నింపేందుకు 29.20 MCM నీరు, వార్షిక ఆవిరి నష్టాల భర్తీ కోసం 2.20 MCM నీటిని, జలవనరుల శాఖ మార్గదర్శకాల ప్రకారం నీటి లభ్యతను బట్టి కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. అదనంగా, AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024 కింద ప్రాజెక్టుకు వర్తించే ప్రోత్సాహకాలను విస్తరించేందుకు కూడా మంత్రి మండలి సమ్మతి తెలిపింది.

23. ఇంధన శాఖ:
విజయనగరం జిల్లా వంగర మండలం తలగం గ్రామంలో 12 TPD కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ స్థాపించడానికి M/s అమృత శ్రీ బయో-CNG ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ప్రాజెక్ట్ ఆమోదం మరియు ప్రోత్సాహకాలు విస్తరించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

24. ఇంధన శాఖ:
M/s Chroma-Atoor Power Product Private Limited అభ్యర్థన మేరకు, 200 TPD సామర్థ్యంతో (10 యూనిట్లు × 20 TPD) ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ప్రాజెక్ట్ స్థలాన్ని గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని ఎడవల్లి గ్రామం నుండి, పాల్నాడు జిల్లా రేంటచింతల మండలం జెట్టిపాలెం (గోలి) గ్రామానికి మార్చేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

25. ఇంధన శాఖ:
M/s Energia Biofuels LLP అభ్యర్థన మేరకు తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామంలో 12 TPD సామర్థ్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ స్థాపనకు AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024 కింద ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. అలాగే, ప్రాజెక్టుకు వర్తించే ప్రోత్సాహకాలను విస్తరించేందుకు కూడా మంత్రి మండలి సమ్మతి తెలిపింది.

26. ఇంధన శాఖ:
NTR జిల్లా G.కొందూరు మండలం కడిమ్ పోతవరం గ్రామంలో 15 TPD కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ స్థాపించడానికి M/s IOC GPS రీన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ప్రాజెక్ట్ ఆమోదం మరియు ప్రోత్సాహకాలు విస్తరించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

27. ఇంధన శాఖ:
పాల్నాడు జిల్లా రొంపిచెర్ల (M), విప్పర్ల (V)లో 12 TPD కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ స్థాపించడానికి M/s డెల్టా బయోగ్యాస్ పాల్నాడు టూ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ప్రాజెక్ట్ ఆమోదం మరియు ప్రోత్సాహకాలు విస్తరించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

28. ఇంధన శాఖ:
ఏలూరు జిల్లా దెందులూరు మండలం ముప్పవరం (V)లో 20 TPD కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ స్థాపించడానికి M/s HPCL రీన్యూవబుల్ & గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అభ్యర్థన మేరకు AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ప్రాజెక్ట్ ఆమోదం మరియు ప్రోత్సాహకాలు విస్తరించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

29. ఇంధన శాఖ:
SPSR నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం సున్నంవారి-చింతల గ్రామంలో 12 TPD కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ స్థాపించడానికి M/s శ్రీ బాలాజీ బయో ఎనర్జీస్ అండ్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ప్రాజెక్ట్ ఆమోదం మరియు ప్రోత్సాహకాలు విస్తరించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

30. ఇంధన శాఖ:
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం భాలాభద్రాపురం (V)లో 15 TPD కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ స్థాపించడానికి M/s విభా బయోఫ్యూయెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ప్రాజెక్ట్ ఆమోదం మరియు ప్రోత్సాహకాలు విస్తరించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

31. ఇంధన శాఖ:
శ్రీ సత్యసాయి జిల్లా NP కుంట మండలం P.కొతపల్లి గ్రామంలో 100 MW సోలార్ పవర్ ప్రాజెక్ట్ స్థాపన కోసం కేటాయించిన 500 ఎకరాల భూమికి సంబంధించి, లీజు ఒప్పందాన్ని పునఃప్రారంభించి, M/s NP Kunta Renewables Private Limited పేరిట కొత్త లీజు అగ్రిమెంట్ అమలు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

అలాగే, వినియోగయోగ్యమైన 325 ఎకరాల భూమికి AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024 నిబంధనల మేరకు, ఎకరాకు సంవత్సరానికి రూ.31,000 లీజు అద్దెను పునఃప్రారంభ తేదీ నుండి ప్రతి రెండు సంవత్సరాలకు 5% పెంపుతో వసూలు చేయనున్నట్లు నిర్ణయించింది.

32. ఇంధన శాఖ:
AP పవర్ యుటిలిటీలలో ఎంట్రీ-లెవల్ ఇంజనీరింగ్ కేడర్ పోస్టులైన ఎలక్ట్రికల్, సివిల్ మరియు టెలికాం విభాగాల్లో మొత్తం 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టులను ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయడానికి, కొన్ని షరతులతో మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నియామకాలు APTRANSCO Joint & Managing Director అభ్యర్థన మేరకు చేపట్టబడనున్నాయి. విభాగాల వారీగా APTRANSCOలో 200, APGENCOలో 100, APSPDCLలో 134, APCPDCLలో 60, APEPDCLలో 135 పోస్టులు భర్తీ చేయనున్నారు.

రెవెన్యూ శాఖ…

33. రెవెన్యూ:
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రామేశ్వరం H/o అనూరు గ్రామంలో Sy.Nos.11/1, 11/4 మొదలైనవాటిలో 10.66 ఎకరాల ప్రభుత్వ భూమిని కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు వేస్ట్ టు ఎనర్జీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ స్థాపన కోసం మార్కెట్ విలువ ఎకరాకు రూ.87,12,000/- చొప్పున (మొత్తం భూమి ధర రూ.9,28,69,920/-) చెల్లింపుపై కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కలెక్టర్ సిఫార్సు మేరకు అన్నెగ్జర్-XI/DPR/NOC స్థానిక సంస్థ నుండి సమర్పించాలి. అలాగే NGT, చెన్నై వద్ద పెండింగ్‌లో ఉన్న OA No.207 of 2025 ఫలితానికి లోబడి ఈ కేటాయింపు ఉంటుంది.

34. రెవెన్యూ:
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఇరుగులం గ్రామంలో Sy.No.4/7 మొదలైనవాటిలో 9.32 ఎకరాల ప్రభుత్వ భూమిని APIIC లిమిటెడ్‌కు ఇండస్ట్రియల్ పార్క్ స్థాపన కోసం జి.ఓ.ఎంఎస్.నం.106, Revenue (Assn.I) శాఖ, తేదీ:16.03.2017 ప్రకారం ఉచితంగా కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

35. రెవెన్యూ:
కాకినాడ జిల్లా కాకినాడ అర్బన్ మండలం పరిధిలోని రామనాయ్యపేట గ్రామంలో Sy.No.116/1C లో 3.90 ఎకరాలు, Sy.No.118/1C2 లో 0.15 ఎకరాలు — మొత్తం 4.05 ఎకరాల ప్రభుత్వ భూమి లీజు పునరుద్ధరణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. National Institute of Hydrology (NIH) కు తూర్పు తీర భారతదేశానికి సంబంధించిన హైడ్రోలాజిక్ అధ్యయనాలు నిర్వహించేందుకు డెల్టాయిక్ రీజనల్ సెంటర్ స్థాపన కోసం తేదీ 22.08.2025 నుండి 30 సంవత్సరాలు: (1) ఎకరాకు సంవత్సరానికి రూ.110/- చొప్పున ప్రతి 5 సంవత్సరాలకు 10% పెంపుతో, లేదా (2) ప్రత్యేక కేసుగా ఎకరాకు సంవత్సరానికి రూ.1,000/- చొప్పున ప్రతి 5 సంవత్సరాలకు 10% పెంపుతో, లేదా (3) మొత్తం 4.05 ఎకరాలకు సంవత్సరానికి రూ.13,72,14,000/- చొప్పున ప్రతి 5 సంవత్సరాలకు 10% పెంపుతో — ఇందులో ఒక పద్ధతిలో లీజు చెల్లించవచ్చు.

36. రెవెన్యూ:
జి.ఓ.ఎంఎస్.నం.340, తేదీ:21.07.2016లోని పేరా నం.(4) యొక్క పాయింట్ నం.III (లీజు వ్యవధి)ని సవరించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుత 33 సంవత్సరాల లీజు స్థానంలో 66 సంవత్సరాలు (మొత్తం 99 సంవత్సరాల వరకు పునరుద్ధరించవచ్చు) గా మార్చడం జరుగుతుంది. ఈ సవరణ తేదీ 13.11.2025 నుండి వర్తిస్తుంది.

జలవనరుల అభివృద్ధి శాఖ…

37.జలవనరుల అభివృద్ధి:
మడకసిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ మరియు వెడల్పు పనులకు సంబంధించిన మూడు ప్రధాన ప్రాజెక్టులకు మొత్తం రూ.790.38 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ మంజూరు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పనులు KM 0.000 నుండి KM 71.000 వరకు అంటే i ) KM 0.000 నుండి KM 8.625 వరకు మరియు KM 10.000 నుండి KM 20.000 వరకు, (ii) KM 20.000 నుండి KM 53.300 వరకు, (iii) KM 53.300 నుండి KM 71.000 వరకు వివిధ దశల్లో చేపట్టబడనున్నాయి.

38. జలవనరుల అభివృద్ధి:
2026–27 సంవత్సరానికి కాలువ వ్యవస్థలో సమర్థవంతమైన నీటి నిర్వహణను లక్ష్యంగా పెట్టుకుని చేపట్టనున్న ‘కాలువ మెరుగుదల మరియు బలోపేతం పనులు’ (6502 పనులు) అమలుకు, జి.ఓ.ఆర్‌టీ.నం.216, WR (CADA) శాఖ, తేదీ 02.05.2026 ద్వారా రూ.39,753.56 లక్షలు మంజూరయ్యాయి. ఈ పనుల అమలులో Water User Associations అందుబాటులో లేని సందర్భాల్లో, అలాగే ఒక్కో పని విలువ రూ.10 లక్షలకు మించిన చోట, 7 రోజుల షార్ట్ టెండర్ నోటీసులు ఆహ్వానించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

పర్యావరణ అటవీ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ…

39. పర్యావరణ అటవీ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ:
IIT తిరుపతి, IISER తిరుపతి మరియు రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగించుకుని ‘AP FIRST’ (Andhra Pradesh – Future Innovation, Research, Science & Technology) సంస్థను కంపెనీస్ యాక్ట్ సెక్షన్-8 కింద కంపెనీగా స్థాపించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

వ్యవసాయ & సహకార శాఖ…

40. వ్యవసాయం & సహకారం:
రాయలసీమను ప్రపంచ స్థాయి హార్టికల్చర్ హబ్‌గా మార్చే లక్ష్యంతో రూ.1,00,000 కోట్లు అంచనా వ్యయంతో ‘ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ ప్లాన్ (IHDP)’ ప్రణాళిక మరియు అమలుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. నీటిపారుదల అభివృద్ధి & నీటి భద్రత, రోడ్డు కనెక్టివిటీ & వ్యాల్యూ చైన్ పోటీతత్వం అన్నింటినీ కలిపిన సమగ్ర, కన్వర్జెంట్ కార్యక్రమంగా దీన్ని రూపొందించారు. రూ.40 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయనున్నంది, మిగిలిన రూ.60 వేల కోట్లు ప్రైవేటు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. ఈ రూ.40 వేల కోట్లలో హార్టీకల్చర్కు రూ.14,906 కోట్లు, ఇరిగేషన్ కు రూ.20,884 కోట్లు, రూరల్ రోడ్డు డవలెప్మెంట్ పనులకు రూ.4,562 కోట్లు కేటాయించడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న హార్టీకల్చర్ ఉత్పత్తులు 222 లక్షల టన్నులను 435 లక్షల టన్నులకు పెంచాలనే లక్ష్యంతో ఈ ప్రాజక్టును ప్రతిపాదించడమైంది.

ఆరోగ్యం, వైద్యం & కుటుంబ సంక్షేమ శాఖ…

41. ఆరోగ్యం, వైద్యం & కుటుంబ సంక్షేమం:
పౌర ఆరోగ్య స్క్రీనింగ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 904…104 మొబైల్ మెడికల్ యూనిట్ల (MMUs) ద్వారా ‘104 డయాగ్నస్టిక్స్ ప్రోగ్రామ్’ అమలుకు అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంచనా వార్షిక వ్యయం రూ.162.72 కోట్లు. కేంద్ర ప్రభుత్వం FY 2026-27 PIP కింద ఆమోదించిన మేరకు NHM నిధుల నుండి, లోటు ఉంటే రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి భరించడం జరుగుతుంది. HM&FW శాఖకు అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఆర్డర్లు మరియు నిర్వహణా మార్గదర్శకాలు జారీ చేయడానికి అనుమతి ఇచ్చింది. ప్రతి సిటిజన్ కు 41 పరీక్షలు చేయడం జరుగుతుంది, ఏడాదికి 50 నుండి 60 లక్షల మంది ఈ టెస్టులు చేయబడతాయి. ఈ టెస్టు రిపోర్టులు అన్నీ డిజలైజ్ చేయబడి అన్ని ఆసుపత్రులకు అందుబాటులో ఉంటాయి.

42. ఆరోగ్యం, వైద్యం & కుటుంబ సంక్షేమం:
ఆంధ్రప్రదేశ్‌లో సంజీవని – రాష్ట్ర వ్యాప్త ఇంటిగ్రేటెడ్ డిజిటల్ కేర్ కోఆర్డినేషన్ మరియు హెల్త్‌కేర్ డెలివరీ సిస్టమ్ (IDCCHDS) అమలు కోసం మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మొదటి సంవత్సరం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మరియు ఓపెక్స్ కోసం రూ. 149 కోట్లు (రూపాయలు నూట నలభై తొమ్మిది కోట్లు) వ్యయం చేయనున్నారు, ఇందులో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) / నేషనల్ ఆయుష్ మిషన్ (NAM) ద్వారా రూ. 90 కోట్లు (భారత ప్రభుత్వం PIP 2026-27లో ఆమోదానికి లోబడి) సమకూర్చబడుతుంది మరియు మిగిలిన రూ. 59 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుండి భరించబడుతుంది. రెండవ సంవత్సరం నుండి ఓపెక్స్ కోసం రూ. 55.5 కోట్లు (రూపాయలు యాభై అయిదు కోట్లు యాభై లక్షలు) వ్యయం చేయనున్నారు, ఇందులో NHM / NAM ద్వారా రూ. 45.5 కోట్లు (భారత ప్రభుత్వం PIP లో ఆమోదానికి లోబడి) మరియు మిగిలిన రూ. 10 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుండి భరించబడుతుంది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును అమలు చేయడానికి ఏజెన్సీ ఎంపిక కోసం RFP జారీ చేయడానికి అనుమతి ఇవ్వడానికి కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఉన్నత విద్య శాఖ…

43. ఉన్నత విద్య:
ఉన్నత విద్య శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న రాష్ట్ర పబ్లిక్ విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి వారి సేవలను పరిగణలోనికి తీసుకుని APPSC నిర్వహించే రాబోయే అసిస్టెంట్ ప్రొఫెసర్ నేరు నియామక లిఖిత పరీక్షలో వెయిటేజ్ ఇవ్వడానికి ఒక్కసారి మాత్రం వర్తించే చర్యగా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అర్హతగల కాంట్రాక్ట్ సేవలో పూర్తయిన ప్రతి సంవత్సరానికి గరిష్టంగా 10 సంవత్సరాల పరిమితితో లిఖిత పరీక్ష మొత్తం మార్కులలో 0.5% వెయిటేజ్ అందించబడుతుంది. అభ్యర్థి APPSC లిఖిత పరీక్షలో స్వతంత్రంగా నిర్ణీత అర్హత మార్కులు సాధించిన తర్వాత మాత్రమే ఈ వెయిటేజ్ మార్కులు జోడించబడతాయి. ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా రాష్ట్ర పబ్లిక్ విశ్వవిద్యాలయాల్లో 1,244 రెగ్యులర్ మరియు 279 బ్యాక్‌లాగ్ ఖాళీలతో సహా మొత్తం 1,523 బోధన పోస్టులను భర్తీ చేయనుంది. ఈ చర్య మెరిట్ మరియు పారదర్శకతను కాపాడుతూ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి న్యాయమైన గుర్తింపు కల్పించే లక్ష్యంతో రూపొందించబడింది.

 

సాంఘిక సంక్షేమ శాఖ…

44. సాంఘిక సంక్షేమం:
ఉన్నత విద్య శాఖకు రెండు అనుమతులు ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది: (A) ఫైనాన్స్ శాఖ ముందే అంగీకారం ఇచ్చిన నేపథ్యంలో, జాబ్ క్యాలెండర్‌లో భాగంగా బ్యాక్‌లాగ్ ఫ్యాకల్టీ ఖాళీలను నేరు నియామకం ద్వారా భర్తీ చేయడానికి అనుమతి; (B) జి.ఓ.20, HE శాఖ, తేదీ:28.06.2023 మార్గదర్శకాల ప్రకారం — రెగ్యులర్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ మాదిరిగా లిఖిత పరీక్ష మినహాయింపు లేకుండా — అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్యాక్‌లాగ్ ఖాళీల స్క్రీనింగ్ కోసం APPSC ద్వారా లిఖిత పరీక్ష నిర్వహించడానికి అనుమతి.

సాధారణ పరిపాలన శాఖ…

45. సాధారణ పరిపాలన శాఖ:
ప్రపంచ వ్యాప్త అనిశ్చితులు మరియు సప్లై చైన్ అంతరాయాల నేపథ్యంలో వనరుల సంరక్షణ మరియు స్వావలంబన కోసం రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గౌరవనీయ ప్రధానమంత్రి ‘నేషన్ ఫర్స్ట్’ పిలుపుకు అనుగుణంగా ఈ ప్రణాళిక రూపొందించబడింది. ప్ర్తసుతం కొనసాగుచున్న యుద్దం నేపథ్యంలో పొదుపు చర్యలు అమలు పర్చేందుకు ఈ ప్రణాళిక రూపొందించబడింది. మంత్రులు, ప్రజాపతులు, అధికారులు, ప్రజలు అంతా కూ ఖర్చు తగ్గించుకోవడంతో పాటు ఇంపోర్టెడ్ ప్యూయల్స్ పెట్రోల్, డీజిల్, గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకొని రెన్యువబుల్ ఇంధన వినియోగాన్ని పెంచుకోవడం ద్వారా దేశ స్వావలంబన సాదించేందుకు ఇది ప్రతిపాదించడమైంది.

ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *