Breaking News

పిడుగుపాటు వర్షాలు పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు మరోవైపు ఉరుములతో కూడిన పిడుగుపాటు వర్షాలు పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. గురువారం నంద్యాల జిల్లా సంజామలలో 43.3 డిగ్రీలు నమోదైందని తెలిపారు. అలాగే 28 జిల్లాలకు గాను 17 జిల్లాల పరిధిలోని 126 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు.

శుక్రవారం(15-05-26) రాష్ట్రంలో 43-44°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందన్నారు.

రేపు వడగాలులు వీచే అవకాశం ఉన్న మండలాలు

అల్లూరి జిల్లా జికే వీధి మండలం,

పోలవరం జిల్లా చింతూరు,గంగవరం,కూనవరం,రంపచోడవరం

కోనసీమ జిల్లా ఆత్రేయపురం

తూర్పుగోదావరి జిల్లా
చాగల్లు, గోకవరం, కోరుకొండ,కొవ్వూరు, రాజమహేంద్రవరం అర్బన్ & రూరల్, రాజానగరం, సీతానగరం,తాళ్లపూడి

ఎన్టీఆర్ జిల్లా
జి. కొండూరు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల

అనంతపురం జిల్లా
అనంతపురం రూరల్, బుక్కరాయ సముద్రం మండలాల్లో(20) వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. శనివారం 26 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మరోవైపు నైరుతి మరియు ఆనుకొని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రం నుండి, తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు చెట్ల క్రింద నిలబడరాదని వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు.

గురువారం నంద్యాల(జి) సంజామలలో 43.3°C, కర్నూలు(జి) కౌతాళంలో 42.9°C, అనంతపురం(జి) తెరన్నపల్లిలో 42.8°C,
చిత్తూరు(జి) రాయలపేట, వైఎస్సార్ కడప(జి) జమ్మలమడుగులో 42.2°C, ప్రకాశం(జి) కొప్పెరపాడులో 42°C,
మర్కాపురం(జి) కంభంలో 41.9°C, మన్యం(జి) పాచిపెంటలో 41.4°C, పల్నాడు(జి) గురజాల, శ్రీసత్యసాయి(జి) దాడితోటలో 41.3°C, విజయనగరం(జి) రామభద్రాపురంలో 41.2°C, నెల్లూరు(జి) కొమ్మిపాడులో 41 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *