Breaking News

భవిష్యత్తులో నీటి కొరత రాకుండా కృష్ణ నదిపై చెక్కు డ్యామ్ లు నిర్మించాలి

-రిపబ్లిక్ ఆన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) జాతీయ కార్యదర్శిపేరం శివ నాగేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవిష్యత్తులో నీటి కొరత లేకుండా కృష్ణా నదిపై చెక్కు డ్యామ్ లు నిర్మించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ)జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు తెలిపారు శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలుత సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఆయన ఫోటో పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ 1946లో ప్రకాశం బ్యారేజీ నిర్మాణ సమయంలో 3 కోట్లుగా ఉన్న జనాభా ఇప్పుడు 12 కోట్లకు పెరిగింది పెరిగిన జనాభాకు తగ్గట్లుగా నీటి వనరుల నిర్వహణ అవసరమనీ ఏటా సుమారు 15 నుండి 20 లక్షల క్యూసెక్కుల కృష్ణా నది నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సముద్రంలో కలిసే నీటిని నిల్వ చేసేందుకు చెక్ డ్యామ్‌లు నిర్మించి, చెరువులకు మళ్లించాలని తద్వారా పశుపక్షాదులకు మరియు భూగర్భ జలాలకు మేలు జరుగుతుందని సూచించారు. అమరావతిని రాజధానిగా చేయడం సంతోషకరమే అయినా ప్రస్తుతం సామాన్యులకు నీటి భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపితే నిధులు వచ్చే అవకాశం ఉందని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా నదుల అనుసంధానానికి సుముఖంగా ఉందని తెలిపారు.భవిష్యత్తులో ఆహారం కంటే నీటికే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని నీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారానే దీనిని నివారించగలమని హెచ్చరించారు.రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) ఆధ్వర్యంలో గత 11 ఏళ్లుగా ఈ అంశంపై పోరాడుతున్నామని, ముఖ్యమంత్రి స్పందించకపోవడం చాలా బాధాకరమని రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు తెలియజేసిన కూడా ఫలితం అంతంత మాత్రంగానే ఉందని ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రకాశం బ్యారేజ్ ఎగువ మరియు దిగువన శాస్త్రీయంగా చెక్ డాంలను నిర్మిస్తే నది పొడవునా నీటి నిలవల సామర్థ్యం పెరుగుతుంది దీనివల్ల చుట్టుపక్కల బావులు బోర్లు ఎండిపోకుండా పరిసర ప్రాంతాలు పచ్చగా కళకళలాడతాయని అన్నారు.
నదీ జలాల వివాదాలను పక్కనపెట్టి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమన్వయకర్తగా వ్యవహరించాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు స్థానిక చెరువుల ఆక్రమణలను తొలగించి నదిలను నీటితో నింపే ప్రణాళికలను సిద్ధం చేసి ప్రతి చుక్కను భద్రపరిచే చట్టాలను కఠినంతరం చేయాలని కోరారు.ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్. హైదరాబాద్ కార్యదర్శి, రాజకుమార్. ప్రకాశం జిల్లా నాయకులు, గుంటూరు జిల్లా అధ్యక్షులు సాంబయ్య, రాష్ట్ర నాయకులు ముత్తయ్య, ప్రకాశం జిల్లా అధ్యక్షులు పేరేంటి శ్రీను, వంగవోలు శ్రీనివాస్. ఏలూరు జిల్లా అధ్యక్షులు, పల్నాడు జిల్లా సత్తిబాబ, వెంకటేష్ కృష్ణాజిల్లా నాయకులు, చిరంజీవి చిత్తూరు జిల్లా నాయకులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *