గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణకు స్తలాలు ఇచ్చే స్తల యజమానుల నుండి స్వచ్చంద అనుమతి పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని నగర కమిషనర్ కే.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో పట్టణ ప్రణాళిక మరియు ఇంజనీరింగ్ అధికారులతో రోడ్డు విస్తరణ పనుల వేగవంతంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో బృందావన్ గార్డెన్స్ నుండి హనుమయ్య కంపెనీ వరకు విస్తరణ పనులను వేగంగా రోజు వారీ కార్యాచరణ సిద్దం చేసుకోవాలన్నారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా 60 అడుగుల రోడ్డును 80 అడుగుల రోడ్డుగా విస్తరణ చేస్తున్నందున పనులు జరిగే సమయంలో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణ పనులను పట్టణ ప్రణాళిక మరియు ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డు విస్తరణ చేయుటకు పెండింగ్ ఉన్న ప్రాంతాన్ని మార్కింగ్ చేసి, సదరు ప్రాంతంలో ఉన్న నిర్మాణాలను క్లియర్ చేసి, త్వరితగతిన ఇంజనీరింగ్ అధికారులకు అందజేయాని, అలాగే ఇంజనీరింగ్ అధికారులు కూడా సదరు ప్రాంతంలో డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతం త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డు విస్తరణకు సంబంధించి కోర్ట్ కేసులు ఉన్న వాటి వివరాలు అడిగి తెలుసుకొని, కేసులు ఉన్న వాటికి న్యాయ పరమైన సలహా తీసుకొని రోడ్డు విస్తరణకు ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో సిటీ ప్లానర్ రాంబాబు, యస్.ఈ జి. వెంకటేశ్వర రావు, ఏ.సి.పి రెహమాన్, డి.ఈ.ఈ వెంకట రమణ పట్టణ ప్రణాళిక మరియు ఇంజనీరింగ్ అధికారులు అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News