Breaking News

పోలవరం నిర్వాసితులకు నాలుగో విడతగా 307 కోట్లు పంపిణీ

-నాడు, నేడు నిర్వాసితులకు అండగా ఉంది చంద్రబాబే.
-2027 లో మోధీ చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం.
-మంత్రి నిమ్మల రామానాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నాలుగో విడతగారూ. 307 కోట్లు నిధులు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసినట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈ నిధులను శుక్రవారం నిర్వాసితులకు అందజేసారు. ఈ వివరాలను రామానాయుడు మీడియాకు వెల్లడించారు. 2014 -19 తెలుగుదేశం హయాంలో 72 శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టు ను జగన్ తన ఐదేళ్ల కాలంలో రివర్స్ టెండరింగ్ పేరిట విధ్వంసానికి పాల్పడ్డాడని విమర్శించారు. పోలవరం ఉనికినే ప్రశ్నార్ధకం చేశాడు అన్నారు. రేపు మాపంటూ నాలుగు గడువులు చెప్పి పూర్తి చేయలేక చేతులెత్తేసాడు అన్నారు. పైగా అసలు పోలవరం పూర్తవుతుందో లేదో, ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితిలో కి పోలవరాన్ని నెట్టేసాడన్నారు. తెదేపా హయాంలో కేంద్ర నిధులు కోసం ఎదురు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనులు చకచకా చేసేవారమన్నారు. అందువలన అప్పుడు 72 శాతం పూర్తయిందన్నారు. ఐదేళ్ల జగన్ హయాంలో కేవలం రెండు శాతం, అది కూడా దోచుకోవడానికి వీలైన మట్టి పనులు మాత్రమే చేసి, పోలవరాన్ని మట్టికరిపించాడన్నారు. అలాగే పోలవరానికి అమూల్యమైన ఆస్తులు ఇచ్చిన నిర్వాసితులను తన హయాంలో జగన్ తీవ్ర నిర్లక్ష్యం చేశాడు అన్నారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ, నేడు కూటమి ప్రభుత్వ హయాంలోనూ నిర్వాసితులను నిండు మనసుతో ఆదుకున్న నిజమైన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమేనని రామానాయుడు చెప్పారు.

2017 లో 700 కోట్లు,2025 జనవరిలో 800 కోట్లు, 2025 అక్టోబర్లో మరో 1000 కోట్లు, 2026 మార్చిలో 220 కోట్లు, నేడు నాలుగో విడతగా 307 కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 2027 జూన్ నాటికి గౌరవ ప్రధాని మోదీ చేతుల మీదుగా పోలవరం జాతికి అంకితం చేయడానికి గడువు నిర్దేశించుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నామన్నారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ఎంత ముఖ్యమో నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, పరిహారం పూర్తిగా చెల్లించడం అంతే ముఖ్యమని.. ముఖ్యమంత్రి చంద్రబాబు మాకు దిశా నిర్దేశం చేశారని నిమ్మల చెప్పారు.. నేడు విడుదల చేసిన 307 కోట్ల నిధులు తమ తమ ఖాతాలకు జమవుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తూ నిర్వాసితులు మెసేజ్లు పంపుతున్నారని రామానాయుడు చెప్పారు.

పోలవరం నిర్వాసితులు అందరూ.. పరిహారం పొందటంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని, దళారులను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. 20 నెలల కాలంలో మూడు విడతలుగా నిర్వాసితులకు నిధులు ఇచ్చి, ఇప్పుడు నాలుగో విడతగా మళ్లీ ఇస్తున్న కూటమి ప్రభుత్వ నిబద్ధతను.. ప్రజలు గమనించాలన్నారు.. జగన్ హయాంలో నిర్వాసితులకు ఒక పైసా ఇవ్వకపోగా.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసిన దానికి రియంబర్స్ గా వచ్చిన 3800 కోట్లు నిధులను జగన్ దారి మళ్ళించాడని రామానాయుడు విమర్శించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *