Breaking News

నిజాంపేట్ లో రాజీవ్ గాంధీ నగర్ లో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

-పరిపూర్ణ ఆరోగ్యానికి తరచూ వైద్య పరీక్షలు అవసరం – డా. మురళీ కృష్ణ

నిజాంపేట్ (హైదరాబాద్), నేటి పత్రిక ప్రజావార్త :
పరిపూర్ణ ఆరోగ్యానికి తరచూ ప్రాధమిక వైద్య పరీక్షలు చేయించుకుంటే అన్నీ విధాలుగా శ్రేయస్కరమని ఎయిర్ ఫోర్స్ విశ్రాంత అధికారి డా. మురళీ కృష్ణ అన్నారు. మానవసేవే మాధవ సేవ గా భావించే డా.మురళీ కృష్ణ బాచుపల్లి మున్సిపాలిటీ నిజాంపేట్ రాజీవ్ గాంధీ నగర్ లోని క్రిష్ మెడ్ స్పెషాలిటీ క్లినిక్స్ లో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక ప్రతీ ఆదివారం ఈ ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని ….అయితే ఉదయం 10:30 నుండి 11:30 మధ్య సెల్ 70752 12612 కు ఫోన్ చేసి ముందస్తు అపాయింట్మెంట్ తీసుకోవాల్సింది గా కోరారు.

సాధారణంగా మహిళల్లో ప్రతి నెల బాహిష్టు వలన కొందరిలో రక్త హీనత, అలసట, ఆయాసం, రక్తం తగ్గుదల వంటివి చోటు చేసుకున్నాయని అన్నారు. ఈ శిబిరం లో కంప్లీట్ బ్లడ్ కౌంట్ ద్వారా ముఖ్యంగా హీమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ కౌంట్ గుర్తించి తగిన పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలిస్తామన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు ఈ శిబిరం లో పాల్గొని డా. మురళీకృష్ణ ను మనసారా అభినందించారు. మున్ముందు దశల వారీగా ఈ శిబిరాన్ని విస్తృతం చేయాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *