Breaking News

తండ్రి ఆరోగ్యం ఇంటిల్లిపాదికి శ్రీరామరక్ష… : డా. మురళీ కృష్ణ

-ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
తండ్రి ఆరోగ్యం ఇంటిల్లిపాదికి శ్రీరామ రక్ష…అలాగే ఆరోగ్యవంత జీవితం ద్వారానే ఆ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది అని ప్రముఖ వైద్యులు డా. మురళీ కృష్ణ అన్నారు.

ఫాదర్స్ డే సందర్భంగా హైదరాబాద్ నిజాంపేట్ రాజీవ్ గాంధీ నగర్ లోని క్రిష్ మెడ్ స్పెషాలిటీ క్లినిక్స్ లో ఉచిత వైద్య శిబిరం జరిగింది. డా. మురళీ కృష్ణ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తరచూ వైద్య పరీక్షల ద్వారానే ఆరోగ్యపరమైన, శారీరక లోపాలను గుర్తించి సరిచేసుకోగలరని అన్నారు. తమ బిడ్డల ప్రతి అడుగులోనూ వెన్నంటి నడిచే ఆదర్శం తండ్రులదని అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ ప్రేమకు అమ్మ ప్రతిరూపం అయితే… బాధ్యత కు నాన్న నిలువెత్తు నిదర్శనమని అన్నారు. పిల్లల చిరునవ్వు కోసం తన జీవితాన్ని త్యాగం చేసేది నాన్న అని అన్నారు.

ఈ వైద్య శిబిరంలో కంప్లీట్ బ్లడ్ కౌంట్, రాండమ్ బ్లడ్ షుగర్, HBA1C, లివర్ ఫంక్షన్ తదితర పరీక్షలు జరిగాయి. ముందుగా ఫాదర్స్ డే కేక్ కటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మురళీ కృష్ణ సతీమణి డా. శ్వేత పద్మ, తల్లితండ్రులు అరుణ కుమారి – ఎస్ సాంబశివరావు, నిమ్మరాజు కుమారుడు శ్రీవత్సవ కుమార్, ఆయా కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *