Breaking News

ఘనంగా ఫినిక్స్ గ్రీన్ వ్యాలీ ప్రై.లి. & మానికొండ గ్రీన్ ఎస్టేట్ ప్రై.లి. 7వ వార్షికోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జులై 15 బుధవారం నాటికి ఫినిక్స్ గ్రీన్ వ్యాలీ ప్రైవేట్ లిమిటెడ్ & మానికొండ గ్రీన్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి ఏడు సంవత్సరాలు గడిచిన సందర్భంగా బుధవారం పడమట లోని ఓ ప్రైవేటు ఆడిటోరియంలో వార్షికోత్సవ వేడుకలు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ డా. మానికొండ నాగ భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మానికొండ నాగ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ మొదట మార్కెటింగ్ కంపెనీగా ఏర్పడి ఏడు ప్రాజెక్టులు పూర్తి చేసి అనంతరం ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ ప్రైవేట్ లిమిటెడ్ & మానికొండ గ్రీన్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ గా రూపాంతరం చెంది సొంతంగా మరో ఏడు ప్రాజెక్టులను పూర్తి చేసి 8వ ప్రాజెక్టు చేపట్టిన ఘనత తమ కంపెనీకి మాత్రమే సొంతమని అన్నారు. తమ సంస్థలో పనిచేస్తున్న మార్కెటింగ్ ఏజెంట్లను పని వారిలా కాకుండా తమ సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటామని వారికి కావలసిన అన్ని రకాల సదుపాయాలు ఆరోగ్య భీమా లాంటివి కూడా తమ కంపెనీ తరఫునుంచి అందిస్తున్నామని అదేవిధంగా కంపెనీ నిర్దేశించిన టార్గెట్లను పూర్తిచేసి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఉచిత విలువైన బహుమతులు అందిస్తున్నామని తెలియజేశారు. అందులో భాగంగా 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 19 మందికి తమ కుటుంబాలతో కలిపి సన్మానించి దొనకొండ ఏరియాలో 100 గజాల ఓపెన్ ఫ్లాట్స్ ను వారి పేరుపై రిజిస్టర్ చేసి అందించామన్నారు. మధ్యతరగతి పేద కుటుంబాలకు అది తక్కువ ధరలలో ఓపెన్ ప్లాట్స్ అందించడమే తమ యొక్క లక్ష్యం అని అన్నారు. వారి సంస్థ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తూ వారి యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులను మెరుగుపరచడంలో తమ వంతు సాయం చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని నాగ భాస్కర్ తెలియజేశారు. తమ సంస్థలో జాయిన్ అవ్వాలి అనుకునేవారు బందరు రోడ్డు సిద్ధార్థ మహిళా శాల, కళాంజలి షోరూం వద్ద ఉన్న తమ ఆఫీసులో సంప్రదించి ఉద్యోగాలు పొందవచ్చు అని, అదేవిధంగా ప్లాట్స్ కొనుగోలు అమ్మకాలు జరపవచ్చును అని తెలియజేశారు. తమకు ఇన్ని రోజులు వెన్నంటి ఉండి తమ వ్యాపార అభివృద్ధి భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు స్నేహితులు కంపెనీ స్టాఫ్ కస్టమర్ దేవుళ్ళు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *