Breaking News

సీదిరి అప్పలరాజు కుటుంబంపై వేధింపులు ఆపాలి… : సైకం రాజశేఖర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఆయన కుటుంబంపై రాజకీయ కక్షతో తప్పుడు కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఏపీ ఫిషరీస్ మెన్ జేఏసీ, అమరావతి చైర్మన్, హైకోర్టు న్యాయవాది సైకం రాజశేఖర్ ఆరోపించారు. గురువారం గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైకం రాజశేఖర్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగానే ఈ చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఈనెల11న జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి అసలు నిందితుడైన సిద్ధార్థపై ఇప్పటికే ఎసఐఆర్ నమోదైందని, ఇరుపక్షాల అంగీకారంతో నష్టపరిహారం కూడా చెల్లించడం జరిగిందని వారు పేర్కొన్నారు. అయితే, మూడు రోజుల తర్వాత సంబంధం లేని అప్పలరాజు కుమారుడిని ఈ కేసులోకి లాగడం, ఆయన భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు. మత్స్యకార నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెట్టడం సరికాదని, అప్పలరాజు, ఆయన కుమారుడిపై నమోదైన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైరెన్ ప్రెసిడెంట్ కోలా హరికృష్ణ, అగ్నికుల క్షత్రియ జాతీయ అధ్యక్షులు వల్లభనేని మణికంఠ, మత్స్యకార నాయకులు వడుగు నరేంద్ర, నడకుదుడు కాళీ, గొడుగు శ్రీనివాసరావు, టి.శంకర్, సైకం సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *