-జులై 17న న్యూఢిల్లీలో రాష్ట్ర మంత్రి ఎస్. సవిత చేతుల మీదుగా పునఃప్రారంభం
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి), న్యూఢిల్లీలోని బాబా ఖడక్ సింగ్ మార్గ్, స్టేట్ ఎంపోరియా కాంప్లెక్స్ (బి-6)లో సరికొత్తగా ముస్తాబు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియంను ఈ నెల జూలై 17వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు పునఃప్రారంభించనున్నట్లు చేనేత జోలి శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ నూతన లేపాక్షి’ హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం ప్రారంభోత్సవ కార్యక్రమం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఘన సమక్షంలో, రాష్ట్ర చేనేత, జౌళి, వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు ఈడబ్ల్యూఎస్ (EWS) సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు (చేనేత & హస్తకళల అభివృద్ధి) సుచిత్ర ఎల్లా, చేనేత-జౌళి, పరిశ్రమలు & వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా (IAS), ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ (IAS) హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అధ్యక్షత వహించనున్నారు.
Prajavartha Online Telugu News