Breaking News

సంక్షేమ హాస్టళ్లలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మెనూ అమలులో రాజీ పడొద్దు

-హాస్టళ్లలో పారిశుధ్య నిర్వహణ, సౌకర్యాల కల్పనపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో 100 శాతం సంతృప్తి రావాలి
-విద్యార్థులతో ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు,సిబ్బంది… ప్రేమ, ఆప్యాయతగా మెలగాలి
-ఎక్కడా చిన్న సమస్య కూడా రానీయెద్దు
-ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి
-మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
-సాంఘిక సంక్షేమ శాఖ డీడీలు, డీసీవోలు, ఏఎస్ డబ్ల్యూవోలతో మంత్రి డా.స్వామి జూమ్ కాన్ఫరెన్స్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మెనూ అమలులో రాజీ పడొద్దని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధికారుల్ని ఆదేశించారు. గురువారం తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టరేట్ లో సాంఘిక సంక్షేమ శాఖ డీడీలు, డీసీవోలు, ఏఎస్ డబ్ల్యూవోలతో మంత్రి డిఎస్ బీవీ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై నిరంతరం సమీక్షిస్తున్నారు. హాస్టళ్లలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మెనూ అమలులో రాజీ పడొద్దు. హాస్టళ్లలో పారిశుధ్య నిర్వహణ, సౌకర్యాల కల్పనపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో 100 శాతం సంతృప్తి రావాలి. విద్యార్థులతో ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు ప్రేమ, ఆప్యాయతగా మెలగాలి. ఎక్కడా చిన్న సమస్య కూడా రానీయెద్దు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై నిరంతరం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీతో శానిటేషన్ సిబ్బందిని నియమించాం. అన్ని హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశాం. 10 శాతం డైట్ చార్జీలు పెంచాం, విద్యార్థులకు నైట్ డ్రెస్, బెడ్, మస్కిటో మెస్ లు, టవళ్లు అన్నీ ఇస్తున్నాం. విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం నాయక్ , డైరెక్టర్ బి. లావణ్య వేణి, APSWREIS కార్యదర్శి వి. ప్రసన్న వెంకటేష్, సాంఘిక సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సునీల్ రాజ్ కుమార్, అన్ని జిల్లాల డీడీలు, డీసీవోలు, ఏ ఎస్ డబ్ల్యూవోలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *