న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక భారత్ టెక్స్–2026 ఎక్స్పో నాలుగో రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర BC సంక్షేమ, జౌళి మరియు హస్తకళల శాఖ మంత్రి సవితమ్మ, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ తో కలిసి ఎక్స్పోలో ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ స్టాల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్టైల్స్ స్టాల్స్‌ను పరిశీలించి, ఆయా రాష్ట్రాల సంప్రదాయ వస్త్ర ఉత్పత్తులు, నూతన డిజైన్లు, ఆధునిక సాంకేతికతతో తయారవుతున్న ఉత్పత్తులు, మార్కెటింగ్ విధానాలపై నిర్వాహకులు, కళాకారులు మరియు ప్రతినిధులతో మాట్లాడారు. హస్తకళలు, చేనేత రంగాల అభివృద్ధికి రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, నైపుణ్యాల మార్పిడి, మార్కెట్ విస్తరణ ఎంతో అవసరమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ చేనేత మరియు హస్తకళల ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
Prajavartha Online Telugu News