Breaking News

మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి

-ఫించన్ పెంచాలి
-క్యాష్ లెస్ వైద్య సదుపాయం కల్పించాలి
-*ప్రోటోకాల్ పాటించాలి
-ఇతర రాష్ట్రాల్లో అందిస్తున్న సౌకర్యాలు గౌరవం కల్పించాలి
-మందులు ఇక నుండి కొరియార్ ద్వారా ఇంటివద్దకే అందించాలి
-అసెంబ్లీ ఆవరణలో ఏపీ ఫార్మర్ లెజిస్ట్రేటర్స్ ఫోరమ్ జనరల్ బాడీ సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఫార్మర్ లెజిస్ట్రేటర్స్ ఫోరమ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఫోరమ్ జనరల్ బాడీ సమావేశం అసెంబ్లీ ఆవరణలోని సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు.ముందుగా ఇటీవల కాలంలో మృతి చెందిన సభ్యులకు ఘన నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్సీ, ఏపీ ఫార్మర్ లెజిస్ట్రేటర్స్ ఫోరమ్ అధ్యక్షులు ఎంవీ శివారెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘకాలంలో ప్రజా జీవితంలో ఉంటూ సమాజ సేవలో భాగస్వామ్యం అయిన మాజీ శాసన సభ్యులు,మాజీ శాసన మండలి సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారి డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.మాజీ సభ్యుల ఫించన్ రూ.30వేల నుండి రూ. 50వేలకు పెంచాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణా రాష్ట్రంలో మాజీలకు ఫించన్ పెంపుదల చేశారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఫించన్ పెంచాలని కోరారు.

ఏపీ ఫోరమ్ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ అఖిల భారత సర్వీసుల అధికారులకు వర్తించే తరహాలోనే ఎటువంటి మినహాయింపులు లేకుండా పూర్తి స్థాయి మెడికల్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.వైద్య ఖర్చులు చేసి అనంతరం రీయింబర్స్ కోసం ధరఖాస్తు చేసుకోవటం వయోభారం శారీరక ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా మాజీ సభ్యులకు అందిస్తున్న మందులు ఇక నుండి కొరియార్ ద్వారా ఇంటి వద్దకే అందించాలని సూచించారు.

అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు గ్రేడ్ 1 దేవాలయాల్లో ప్రోటోకాల్ దర్శనం కల్పించాలని దేశ రాజధాని దిల్లీలోని ఏపీ భవన్ లో క్లాస్ 3 ప్రాతిపధికన నామ మాత్రపు రుసుముతోనే వసతి కేటాయించాలని కోరారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనూ మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు తగిన గౌరవం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

సమావేశంలో ఫోరం సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే పీకే సుందరరావు, మాజీ ఎమ్మెల్యేలు డి.రాజగోపాల్, దారా సాంబయ్యలతో పాటు ఈసీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *