Breaking News

వన్ డే ఓపెన్ చెస్ టోర్నమెంట్…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ అమరావతి ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ జిల్లా యంత్రాంగం సహకారంతో పాఠశాల స్థాయి బాలబాలికల కోసం వన్ డే ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ చెస్ టోర్నమెంట్ 23.08.2026 ఆదివారం ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు, ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని  పింగళి వెంకయ్య కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనదలచిన బాలబాలికలు ఉదయం 9.00 గంటలలోపు నేరుగా వచ్చి వాక్-ఇన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా రోటరీ గ్రేటర్ అమరావతి ప్రతినిధి డా. రామ్ – 9393573414ను సంప్రదించి ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అన్ని పాఠశాలల విద్యార్థులు, చెస్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద సంఖ్యలో పాల్గొని టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని చార్ట‌ర్ ప్రెసిడెంట్ డా. కొడాలి వ‌ల్లి కోరారు. ఈ పోటీల‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ శ‌నివారం క‌లెక్ట‌రేట్‌లో ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో క్ల‌బ్ , రోట‌రీ గ్రేట‌ర్ అమ‌రావ‌తి ఫౌండ‌ర్ డా. సీహెచ్ రామ్‌చంద్‌, చెస్ కోచ్ కె.సురేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంటింటా నెట్‌జీరో… ఆదర్శ గ్రామాలే లక్ష్యం

-ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం -అలవరం కోడూరులో నెట్‌జీరో విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు మాడుగుల, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *