Breaking News

స‌త్వర న్యాయానికి మ‌ధ్య‌వ‌ర్తిత్వం

– వివాదాల‌కు సామ‌ర‌స్య పూర్వ‌క ప‌రిష్కారం
– ఈ విష‌యంలో జిల్లాను ఆద‌ర్శంగా నిలబెడ‌దాం
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
వివాదాలకు సత్వర, సామరస్యపూర్వక పరిష్కారం చూపడంలో మధ్యవర్తిత్వం కీలకపాత్ర పోషిస్తుంద‌ని.. మీడియేష‌న్‌తో పాటు న్యాయ సేవ‌ల విష‌యంలో జిల్లాను ఆద‌ర్శ‌వంతంగా నిల‌బెట్ట‌డంలో స‌మ‌ష్టిగా కృషిచేద్దామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. శ‌నివారం క‌లెక్ట‌రేట్ పింగళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో మీడియేష‌న్‌పై మండ‌ల లీగ‌ల్ స‌ర్వీసెస్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ కోర్టుల వెలుప‌ల వివాదాల ప‌రిష్కారానికి వీలుక‌ల్పించే, ఇరుప‌క్షాల స‌మ్మ‌తితో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంలో మ‌ధ్య‌వ‌ర్తిత్వం ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. వివాదాల కంటే చ‌ర్చ‌ల‌తో ప‌రిష్కారానికి ప్రాధాన్య‌మిచ్చే ఓ మంచి సాధ‌నం మ‌ధ్య‌వ‌ర్తిత్వమ‌ని, ముఖ్యంగా కుటుంబ సంబంధాలు దెబ్బతినకుండా, ఇరుపక్షాల అభిప్రాయాలను విని పరస్పర అంగీకారంతో పరిష్కారం చూపేందుకు ఇది ప్ర‌యోజ‌న‌కారి అని పేర్కొన్నారు. ఈ మ‌ధ్య‌వ‌ర్తిత్వంలో జిల్లాను ఆద‌ర్శంగా నిల‌బెట్టేందుకు క‌లిసిక‌ట్టుగా కృషిచేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. ఇందులో భాగంగా వ‌చ్చే వారంలో వివిధ శాఖ‌ల అధికారుల‌తో పాటు మీడియేట‌ర్ల‌తో ప్ర‌త్యేక వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. గ్రామ‌స్థాయి వ‌ర‌కు మీడియేష‌న్ సేవ‌ల‌ను చేర్చే విష‌యంపైనా స‌మావేశంలో చ‌ర్చించారు. కొన్ని కేసుల విష‌యంలో సైకాల‌జిస్టుల సేవ‌లు కూడా అవ‌స‌ర‌మ‌నే విష‌యం స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. స‌మావేశంలో పీజీఆర్ఎస్ నోడ‌ల్ అధికారి జి.జ్యోతి, మ‌ధ్య‌వ‌ర్తులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంటింటా నెట్‌జీరో… ఆదర్శ గ్రామాలే లక్ష్యం

-ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం -అలవరం కోడూరులో నెట్‌జీరో విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు మాడుగుల, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *