Breaking News

అత్యాధునిక వైద్య సేవలకు సెంటినీ డాక్టర్ శ్రీమాన్ హాస్పిటల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధునిక వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా సెంటినీ గ్రూఫ్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మూడో ఆసుపత్రిగా సెంటినీ డాక్టర్ శ్రీమన్నారాయణ హాస్పిటల్‌ను అక్టోబర్ 11న (ఆదివారం) తాడేపల్లి, అమరావతిలో ప్రారంభించనున్ననట్టు ఎండీ మొవ్వ పద్మ తెలిపారు. శనివారం నగరంలోని ఒక హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పద్మ ఆసుపత్రి ప్రత్యేకతలను వెల్లడించారు. సెంటినీ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జె.శ్రీమన్నారాయణ, జాయింట్ రీప్లెస్మెంట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ ఎన్.జగదీష్, న్యూరాలజిస్ట్ డాక్టర్ లావు హరీష్, జనరల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ తుళ్లూరి రేష్మా చౌదరి, గైనకాలజిస్ట్ డాక్టర్ ఎన్.మాధురి, రేడియాలజీ నిపుణులు డాక్టర్ సుషేన్ భాగస్వాములుగా కలిసి సెంటినీ శ్రీమన్నారాయణ హాస్పిటల్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. డాక్టర్ జె.శ్రీమన్నారాయణ మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన తాడేపల్లి-అమరావతిలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన సెంటినీ హాస్పిటల్స్‌ని వైద్య రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందేలా తీర్చిదిద్దినట్టు చెప్పారు. టీం సభ్యులు మాట్లాడుతూ, అత్యాధునిక వైద్య పరికరాలు, ఆధునిక సదుపాయాలతో 150 పడకల హాస్పిటల్‌గా తీర్చిదిద్దామన్నారు. ఈ పరిసర ప్రాంత ప్రజలకు చుట్టుపక్కల జిల్లాల వారికి అత్యుత్తమ వైద్యం అందించడమే తమ ధ్యేయమని, అందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ఏఐ ఆధారిత వైద్యం అందించే మరో ప్రక్రియ ఆసుపత్రిలో అందు బాటులో ఉందన్నారు. అనుభవజ్ఞులైన వైద్యులను డైరెక్టర్లుగా, ప్రమోటర్లుగా భాగస్వామ్యం చేస్తూ ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దినట్టు తెలిపారు. గుండె, నాడీ వ్యవస్థ, మోకాళ్ల సమస్యలు, జీర్ణకోశం, శ్వాసకోశం, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులతో పాటు తదితర వివిధ రకాలైన ఇబ్బందులతో బాధపడే ప్రతి రోగికి మెరుగైన చికిత్స, తగిన వైద్య పర్యవేక్షణ అందించడమే సెంటినీ గ్రూప్ ఆశయమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి చైర్మన్ మొవ్వ ఆనంద్, డైరెక్టర్ మొవ్వ విష్ణు, ఆసుపత్రి సీఈఓ సి.ఎల్.ఎన్. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఏపీ-తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు-విజయ్ భేటీ

-గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ -చెన్నై తాగునీటి అవసరాలు తీర్చాలని కోరిన తమిళనాడు సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *