ముంబై, నేటి పత్రిక ప్రజావార్త:
ముంబైలోని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో, హజ్ కమిటీ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) షానవాస్ సి. (IAS) ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా మర్యాదపూర్వకంగా కలిసి, హజ్–2027కు సంబంధించిన వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సమావేశంలో హజ్ యాత్రికులకు అవసరమైన సౌకర్యాల కల్పన, యాత్ర నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, సేవల మెరుగుదల, యాత్రికులకు మరింత మెరుగైన సహకారం అందించడం వంటి ముఖ్యమైన అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు.హజ్ యాత్రికుల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ, హజ్–2027 యాత్రను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అంశాలపై సమన్వయంతో ముందుకు సాగడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. హజ్ యాత్రికుల అన్ని వేళల కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ ఆదేశాల మేరకు ఎల్లప్పుడూ హజ్ యాత్రికుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.
Prajavartha Online Telugu News