-రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా సగటున 28.18 శాతం బీసీ రిజర్వేషన్లు -రిజర్వేషన్లలో ఎక్కడైతే లోటు ఉంటుందో అక్కడ పార్టీ పరంగా 34 శాతానికి పైగా అవకాశాలు కల్పిస్తాం -రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు,డోలా బాలశ్రీ వీరాంజనేయ స్వామి, సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకు (బీసీ) సముచిత రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. …
Read More »Daily Archives: October 10, 2026
ఇంద్రకీలాద్రిపై బాలా త్రిపురసుందరి దేవిగా నేడు దుర్గమ్మ దర్శనం..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా తొలి రోజైన నిజ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ బాలా త్రిపురసుందరి దేవిగా సాక్షాత్కరిస్తుంది. మనస్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ రోజున రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి.. పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి …
Read More »అత్యాధునిక వైద్య సేవలకు సెంటినీ డాక్టర్ శ్రీమాన్ హాస్పిటల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా సెంటినీ గ్రూఫ్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మూడో ఆసుపత్రిగా సెంటినీ డాక్టర్ శ్రీమన్నారాయణ హాస్పిటల్‌ను అక్టోబర్ 11న (ఆదివారం) తాడేపల్లి, అమరావతిలో ప్రారంభించనున్ననట్టు ఎండీ మొవ్వ పద్మ తెలిపారు. శనివారం నగరంలోని ఒక హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పద్మ ఆసుపత్రి ప్రత్యేకతలను వెల్లడించారు. సెంటినీ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జె.శ్రీమన్నారాయణ, జాయింట్ రీప్లెస్మెంట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ ఎన్.జగదీష్, న్యూరాలజిస్ట్ డాక్టర్ లావు …
Read More »విజయవాడ ఉత్సవ్–2.0 ప్రజలందరి పండుగ.. దసరా అంటేనే విజయవాడ గుర్తుకొచ్చేలా వేడుకలు : కేశినేని జానకి లక్ష్మి
-సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలలో ఉత్సవ్ ఏర్పాట్ల పరిశీలన – కార్యక్రమాల బ్రోచర్ విడుదల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ ఉత్సవ్–2.0లో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సతీమణి జానకి లక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్సవ్‌లో నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్‌ను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా జానకి లక్ష్మి మాట్లాడుతూ.. ఈ ఏడాది విజయవాడ ఉత్సవ్–2.0ను గతంలో కంటే మరింత ఘనంగా …
Read More »రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం
-ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. నగర వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటేలా ఉత్సవాల నిర్వహణ: ఎంపీ కేశినేని చిన్ని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవ్ సీజన్–2.0ను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. రేపు సాయంత్రం ప్రారంభమయ్యే విజయవాడ ఉత్సవ్–2.0 కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీ …
Read More »సరస్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ కేశినేని చిన్ని
-మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెటింగ్ వేదికగా సరస్ మేళా -ఈ నెల 15 నుంచి 31 వరకు పున్నమి ఘాట్‌లో సరస్ మేళా నిర్వహణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: కృష్ణానది తీరంలోని పున్నమి ఘాట్‌లో ఈ నెల 15 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్ మేళా ఏర్పాట్లను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పరిశీలించారు. సరస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎంపీ …
Read More »“సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి “సుజనా ఫౌండేషన్” ద్వారా ప్రతి వారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. చిట్టి నగర్, సర్కిల్ వన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శనివారం నిర్వహించిన “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ వైద్య శిబిరంలో డెంటల్, కంటి పరీక్షలు , ఈ సీ జీ, 2డి ఎకో, ఎక్స్ …
Read More »ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఎన్నికల కమిషన్ తీరు
-రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం -దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు -ప్రజాస్వామ్యానికి, ఓటు హక్కుకు విఘాతం కలిగించేలా ఉంది -రాష్ట్రంలో లక్షలాది ఓట్లను ఏకపక్షంగా తొలగించారు -ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతకు తూట్లు -2023 ఈసీ నియామక చట్టాన్ని పునఃసమీక్షించాలి -ఎంపిక కమిటీలో సీజేఐని పునరుద్ధరిస్తూ చట్టసవరణ చేయాలి -ఈసీఐనెట్, ఈఆర్‌ఓనెట్ లోపాలను బయటపెట్టాలి -ఆర్డబ్ల్యూఈ, పారదర్శక ఓటర్ల సవరణ ప్రక్రియే ప్రజాస్వామ్యానికి రక్షణ -మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: జాతీయ స్థాయిలో ఎన్నికల …
Read More »సీపీఆర్ తో ప్రాణదాతలుగా మారండి… : డాక్టర్ జి సమరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: “గుండె అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు సీపీఆర్ సంజీవిని. సకాలంలో సీపీఆర్ అందించడం ద్వారా బాధితుల ప్రాణాలను కాపాడి ప్రాణదాతలుగా మారండి“ అని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఎన్టీఆర్ జిల్లా ఛైర్మన్ డాక్టర్ జి. సమరం పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని సిద్ధార్థ మహిళా కళాశాలలో సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సమరం మాట్లాడుతూ గుండె అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయినప్పుడు ప్రతి నిమిషం ఎంతో విలువైనదని, అటువంటి …
Read More »చాగల్లు పరిసరాల్లో పులి సంచారం నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించండి
-పులి కదలికలపై ప్రజలకు నిరంతరం సమాచారం అందించాలి -హనుమాన్ బృందాలను మోహరించి, పులిని త్వరగా సురక్షితంగా బంధించండి -అటవీ శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా చాగల్లు గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గ్రామ సమీపంలోని పంట పొలాల మధ్య పులి ఉన్నట్టు గుర్తించిన …
Read More »
Prajavartha Online Telugu News