విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: MAFI ఏపీ బ్రాంచ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 10, 11 తేదీల్లో గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మైదానంలో నిర్వహించిన 45వ ఏపీ మాస్టర్స్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 700 మంది క్రీడాకారులు పాల్గొనగా, ఎన్టీఆర్ జిల్లా నుంచి 45 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. పతక విజేతల వివరాలు: లక్ష్మయ్యకు అథ్లెటిక్స్‌లో మూడు పతకాలు: 800 మీటర్ల పరుగు, హర్డిల్స్, లాంగ్‌జంప్ విభాగాల్లో లక్ష్మయ్య …
Read More »Daily Archives: October 13, 2026
విజయవాడ ఉత్సవ్ 2.0కు ప్రత్యేక ఆకర్షణగా ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్
-పున్నమి ఘాట్‌లో ఒకే వేదికపై పాల్గొన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు -తెలుగులో ప్రసంగం ప్రారంభించిన తమిళనాడు సీఎం విజయ్.. విజయవాడ ప్రజల అభిమానానికి కృతజ్ఞతలు -2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవడం ఖాయం: సీఎం చంద్రబాబు -దక్షిణాది రాష్ట్రాల మధ్య భాష వేరైనా సంస్కృతి, సంప్రదాయాలు ఒక్కటే: ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ( పున్నమిఘాట్), నేటి పత్రిక ప్రజావార్త: కృష్ణమ్మ పరవళ్లు తొక్కే పున్నమి ఘాట్ వేదికగా జరుగుతున్న విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలకు మంగళవారం ప్రత్యేక కళ సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి …
Read More »శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్
-జగన్మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తమిళనాడు సీఎం -వేదాశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు అందజేసిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు -సంప్రదాయ వస్త్రధారణతో విచ్చేసి భక్తులకు చేతులెత్తి అభివాదం చేసిన ముఖ్యమంత్రి ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గౌరవ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి విచ్చేసిన తమిళనాడు ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, విజయవాడ పార్లమెంట్ …
Read More »ఏపీ-తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు-విజయ్ భేటీ
-గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ -చెన్నై తాగునీటి అవసరాలు తీర్చాలని కోరిన తమిళనాడు సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. మంగళవారం క్యాంప్ ఆఫీసుకు వచ్చిన సీఎం విజయ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు పలు అంశాలపై అధికారులతో కలిసి చర్చించారు. ప్రధానంగా గోదావరి-కావేరి నదుల అనుసంధానం ఆవశ్యకతను సీఎం చంద్రబాబు …
Read More »గ్రామీణాభివృద్ధికి రహదారుల బలోపేతం కీలకం
-ఆత్మకూరులో రూ. 8.91 కోట్లతో నాలుగు లేన్స్ రహదారి అభివృద్ధి -రహదారికి వాయుపుత్ర మార్గ్ గా నామకరణం -మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆత్మకూరు ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ, ఎన్‌హెచ్-67 నుంచి ఆత్మకూరు బైపాస్ వరకు రూ. 8.91 కోట్ల …
Read More »పేదల ఆరోగ్య భద్రతకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసా
-ఆత్మకూరు నియోజకవర్గంలో రెండేళ్లలో 1,150 కుటుంబాలకు రూ.10.42 కోట్లకు పైగా ఆర్థిక సహాయం -నేడు మరో 69 కుటుంబాలకు రూ.63.79 లక్షల చెక్కుల పంపిణీ నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త: శ్ అనారోగ్యంతో బాధపడుతూ ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకుని ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పేదల ఆరోగ్య భద్రతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత …
Read More »డ్వాక్రా మహిళా పారిశ్రామికవేత్తలకు ‘స్త్రీనిధి’ భారీ ఊతం
– 48 గంటల్లోనే రు. 3 లక్షల వరకు రుణం – 3 లక్షల లోపు ఉన్న PMFME సబ్సిడీ లోన్స్ ఇప్పుడు స్త్రీ నిధి ద్వారా మంజూరు – మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం – 11 % వడ్డీకే రూ.3 లక్షల స్త్రీనిధి రుణాలు – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ‘స్త్రీనిధి ఆంధ్రప్రదేశ్’ ద్వారా ప్రత్యేక మహిళా పారిశ్రామికవేత్తల రుణ పథకాన్ని …
Read More »మడ అడవుల సంరక్షణతోనే మానవ మనుగడకు భరోసా
-ప్రకృతి సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత -వృక్ష సంపద పరిరక్షణకు వాల్టా చట్టం పటిష్టంగా అమలు చేస్తాం -అవనిగడ్డ నియోజకవర్గం సంఘమేశ్వరంలో మడ అడవుల పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నాగబాబు -సంఘమేశ్వరంలో స్వయంగా మడ మొక్కలు నాటిన నాగబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: మడ అడవుల సంరక్షణ పర్యావరణ పరిరక్షణకే కాకుండా, మానవ మనుగడకు కూడా అత్యంత కీలకమని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నాగబాబు పేర్కొన్నారు. ఒకప్పుడు పొయ్యిలో కట్టెల కోసం మడ అడవులను విచ్చలవిడిగా …
Read More »హజ్–2027 ఏర్పాట్లపై చైర్మన్ హసన్ భాష కీలక సమావేశం
ముంబై, నేటి పత్రిక ప్రజావార్త: ముంబైలోని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో, హజ్ కమిటీ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) షానవాస్ సి. (IAS) ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా మర్యాదపూర్వకంగా కలిసి, హజ్–2027కు సంబంధించిన వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సమావేశంలో హజ్ యాత్రికులకు అవసరమైన సౌకర్యాల కల్పన, యాత్ర నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, సేవల మెరుగుదల, యాత్రికులకు మరింత మెరుగైన సహకారం అందించడం వంటి ముఖ్యమైన అంశాలపై ప్రత్యేకంగా …
Read More »“ఇంటి నుంచే స్థితిస్థాపకత ప్రారంభం” అనే అంశంపై రౌండ్ టేబుల్ వర్క్‌షాప్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవాన్ని పురస్కరించుకుని “ఇంటి నుంచే స్థితిస్థాపకత ప్రారంభం” అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA), యునిసెఫ్ (UNICEF) సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ వర్క్‌షాప్‌ను మంగళవారం ఎస్డీఎంఏ కార్యలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపిఎస్డీఎంఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కౌసర్ బానో మాట్లాడుతూ, విపత్తుల సమర్థవంతమైన నిర్వహణకు ప్రభుత్వ వ్యవస్థలతో పాటు ప్రతి కుటుంబం, యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ, శిక్షణ, అవగాహన …
Read More »
Prajavartha Online Telugu News