విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
MAFI ఏపీ బ్రాంచ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 10, 11 తేదీల్లో గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మైదానంలో నిర్వహించిన 45వ ఏపీ మాస్టర్స్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 700 మంది క్రీడాకారులు పాల్గొనగా, ఎన్టీఆర్ జిల్లా నుంచి 45 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.
పతక విజేతల వివరాలు:
లక్ష్మయ్యకు అథ్లెటిక్స్‌లో మూడు పతకాలు: 800 మీటర్ల పరుగు, హర్డిల్స్, లాంగ్‌జంప్ విభాగాల్లో లక్ష్మయ్య అద్భుత ప్రతిభ కనబరిచి ఒక బంగారు, రెండు వెండి పతకాలు సాధించారు.
పగిడాల నరసింహారెడ్డి: హైజంప్, 200 మీటర్ల హర్డిల్స్‌లో రెండు వెండి పతకాలు సాధించారు.
మాగులూరి వెంకటేశ్వర్లు: 10,000 మీటర్లు, 1,500 మీటర్లు, 5 కిలోమీటర్ల పరుగులో మూడు బంగారు పతకాలు సాధించారు.
నాగిరెడ్డి సురేష్: షాట్‌పుట్‌లో కాంస్య పతకం సాధించారు.
విజయలక్ష్మి: 400 మీటర్లు, 800 మీటర్లు, జావెలిన్ త్రోలో మూడు బంగారు పతకాలు సాధించారు.
వీరంకి నాగేంద్రరావు: 400 మీటర్ల పరుగులో వెండి పతకం సాధించారు.
తమ్ము శ్రీనివాసరావు: 400 మీటర్ల హర్డిల్స్‌లో వెండి, 800 మీటర్లు, ట్రిపుల్ జంప్‌లో కాంస్య పతకాలు సాధించారు.
తోట ఎర్రన్న: హామర్ త్రోలో వెండి పతకం సాధించారు.
మల్లూరు సోమశేఖర్: 800 మీటర్లు, 1,500 మీటర్లు, 5 కిలోమీటర్ల పరుగులో మూడు కాంస్య పతకాలు సాధించారు.
భానుప్రసాద్: 5 కిలోమీటర్ల నడకలో బంగారు, 800 మీటర్ల పరుగులో వెండి, 1,500 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించారు.
గురవారెడ్డి: 5 కిలోమీటర్ల పరుగులో వెండి పతకం సాధించారు.
ఉమాకాంత: 10,000 మీటర్లు, 5,000 మీటర్లు, 1,500 మీటర్ల విభాగాల్లో రెండు బంగారు, ఒక వెండి పతకాలు సాధించారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారులకు క్రీడాభిమానులు అభినందనలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News