Breaking News

శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్

-జగన్మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తమిళనాడు సీఎం
-​వేదాశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు అందజేసిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు
-​సంప్రదాయ వస్త్రధారణతో విచ్చేసి భక్తులకు చేతులెత్తి అభివాదం చేసిన ముఖ్యమంత్రి

​ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గౌరవ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి విచ్చేసిన తమిళనాడు ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని) తదితరులు, ఆలయ అధికారులు సాంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి ప్రధానాలయంలోకి తోడ్కొని వెళ్లారు.

సంప్రదాయ వస్త్రధారణతో ఆలయానికి చేరుకున్న ఆయన, క్యూలైన్లలో ఉన్న భక్తులకు చేతులెత్తి నమస్కరిస్తూ అభివాదం చేశారు. అనంతరం అంతరాలయంలో శ్రీ అమ్మవారిని దర్శించుకుని, విశేష పూజలు నిర్వహించారు.
​దర్శనానంతరం అనివేటి మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఆలయ పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ సంయుక్తంగా తమిళనాడు ముఖ్యమంత్రికి శ్రీ అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలు మరియు దివ్య చిత్రపటాన్ని అందజేశారు.
​ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, నగర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామీణాభివృద్ధికి రహదారుల బలోపేతం కీలకం

-ఆత్మకూరులో రూ. 8.91 కోట్లతో నాలుగు లేన్స్ రహదారి అభివృద్ధి -రహదారికి వాయుపుత్ర మార్గ్ గా నామకరణం -మంగళగిరి క్యాంపు …