-జ్ఞానం, వివేకం, సద్బుద్ధికి ప్రతీకగా గాయత్రీ దేవి ఆరాధన ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం శ్రీ కనకదుర్గమ్మవారు గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేదమాతగా, జ్ఞానం మరియు ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా గాయత్రీ దేవిని భక్తులు ఆరాధిస్తారు. ఈ అలంకార దర్శనం కోసం భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. గాయత్రీ దేవి అలంకార విశిష్టత హిందూ ధార్మిక సంప్రదాయంలో గాయత్రీ దేవికి ప్రత్యేక …
Read More »Daily Archives: October 11, 2026
జగన్మాత కనకదుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
-భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేలా కలెక్టర్, అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు -రాష్ట్ర సుభిక్షం, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కలగాలని అమ్మవారికి ప్రార్థన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మవారిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదివారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, జగన్మాత ఆశీస్సులు పొందారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని, యువతకు మెరుగైన భవిష్యత్తు లభించాలని …
Read More »కన్నులపండువగా శ్రీ దుర్గా మల్లేశ్వరుల దివ్య నగరోత్సవం
-శివాలయం నుండి వైభవంగా ప్రారంభమైన స్వామివార్ల ఊరేగింపు -శాస్త్రోక్తంగా పాల్గొన్న పాలకమండలి చైర్మన్, సభ్యులు, భక్తులు -అమ్మవారి రావిచెట్టు వద్ద ఘనంగా ఆస్థాన కార్యక్రమం నిర్వహణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాల తొలి రోజైన ఆదివారం సాయంత్రం జగన్మాత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దివ్య నగరోత్సవం అత్యంత నేత్రపర్వంగా జరిగింది. కొండపై కొలువుదీరిన శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం (శివాలయం) నుండి ఉత్సవమూర్తుల పల్లకీ ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది. వేద …
Read More »అమ్మవారి సన్నిధిలో వైభవంగా ఉత్సవాలు
– భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు – మంచి నీరు సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు – 24/7 పాటు అధికార యంత్రాంగం అందుబాటులో – కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ – విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సన్నిధిలో ఉత్సవాలను వైభవంగా నిర్వహించడంతో పాటు, దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. …
Read More »కనకదుర్గమ్మకు కాణిపాకం ఆలయం పట్టు వస్త్రాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: దసరా ఉత్సవాల సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం తరఫున సోమవారం సాయంత్రం శ్రీ కనకదుర్గమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తలు, అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాణిపాకం ఆలయ బృందానికి శ్రీ కనకదుర్గమ్మ ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత ఆలయ మర్యాదల్లో భాగంగా వేద పండితులు ఆశీర్వచనం …
Read More »భారత రాష్ట్రపతి పర్యటన సమయంపై ప్రసారమవుతున్న వార్తలకు దేవస్థానం వివరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఈ నెల 14వ తేదీన (బుధవారం) గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దర్శన పర్యటన షెడ్యూల్ మరియు ఆలయ మహానివేదన సమయాలపై కొన్ని మాధ్యమాలలో వస్తున్న వార్తలపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం వాస్తవాలను వెల్లడిస్తోంది. భారత రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి రాష్ట్రపతి భవన్ సెక్రటేరియట్, రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ (GAD), పోలీస్ మరియు జిల్లా యంత్రాంగంతో ప్రాథమిక సమన్వయం జరుగుతోంది వారి పర్యటన …
Read More »శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున పట్టువస్త్రాల సమర్పణ
-శ్రీకాళహస్తి ఆలయ కార్యనిర్వహణ అధికారి బి.కె. వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, బోర్డు సభ్యుల సమర్పణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున ఆలయ కార్యనిర్వహణ అధికారి బి.కె. వెంకటేశ్వర్లు, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, దేవస్థానం బోర్డు సభ్యులు కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలతో సారెను సమర్పణలు అందజేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని, భక్తిశ్రద్ధలతో సమర్పణలు అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై …
Read More »తొలిరోజు అమ్మవారి సన్నిధిలో ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు
-తొలిరోజు అమ్మవారిని దర్శించుకోవడం గొప్ప అనుభూతి -రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలి డిప్యూటీ స్పీకర్ ఆకాంక్ష. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆదివారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల తొలిరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ తొలిరోజు అమ్మవారి సన్నిధికి విచ్చేసి దర్శనం చేసుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని ఆయన తెలిపారు. …
Read More »దశాబ్దాల నిరీక్షణకు తెర… 939 పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు
-వర్చువల్‌గా నెల్లూరులో సర్వేపల్లి కట్ట ఇళ్ల పట్టాల పంపిణీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు -రూ.600 కోట్ల విలువైన 22.31 ఎకరాల భూమిపై పేదలకు హక్కులు -701 మంది మహిళల పేరిట పట్టాలు… మహిళా సాధికారతకు పెద్దపీట -వచ్చే సంక్రాంతిలోగా నెల్లూరులో మరో 4,000 ఇళ్ల పట్టాల పంపిణీకి సీఎం ఆదేశం -రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు భద్రత, ఆత్మగౌరవం, ఆస్తి లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత హక్కులు …
Read More »ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలను గ్రాండ్ సక్సెస్ చేయాలి
-13వ తేదీ నుంచి నిర్వహించే సరస్ మేళా దేశానికి ఆదర్శంగా నిలవాలి -విజయవాడ ఉత్సవ్ 2.0లో సెలబ్రేషన్, ట్రెడిషన్ ఉండాలి -వరుస కార్యక్రమాలను దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం కలిసి సక్సెస్ చేయాలి -ఆయా శాఖల అధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ దుర్గగుడిలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలను గ్రాండ్ సక్సెస్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం కలిసి పనిచేయాలని సూచించారు. …
Read More »
Prajavartha Online Telugu News