-గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి -నాయకుల త్యాగాలకు తగిన గుర్తింపు ఇవ్వాలి -స్థానిక ఎన్నికల్లో మన వాళ్లకు తగిన సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి -గిరిజన గ్రామాల అభివృద్ధిని గత గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది -ప్రజా అవసరాలను విస్మరించి.. పార్టీ రంగుల కోసం వందల కోట్ల ఖర్చు చేసింది -రాజకీయాలకు అతీతంగా గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా నిధుల కేటాయించాము -రహదారులు, ఉపాధి, వైద్య సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకున్నాం -అడవితల్లి బాట 2.0 ద్వారా రూ.2,052 కోట్లతో 2,569 పనులకు శ్రీకారం -రంపచోడవరం …
Read More »Daily Archives: October 11, 2026
మీ రాకతో మా గ్రామానికి పండుగ వచ్చింది
-మీరు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం క్షేమంగా ఉంటుంది -బాట బాగాలేనప్పుడు మా ఊరికి ఆటోలు, అంబులెన్సులు లేవు -మీ రాక మా గ్రామాల అభివృద్ధికి అతిపెద్ద ముందడుగు -మాటా మంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రితో గిరిజన గ్రామాల ప్రజలు -సమస్యలు వివరించిన వెంటనే పరిష్కరించేందుకు పవన్ కళ్యాణ్ భరోసా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: ‘మీరు రాక ముందు అడవి మధ్యన ఉండే మా బతుకుల్లో వెలుగులు లేవు.. మీరు రాక ముందు మా గ్రామాలకు రోడ్లు లేవు.. అంబులెన్సులు, ఆటోలు లేవు.. మీ …
Read More »చింత చెట్టు చెంతన.. గిరిపుత్రుల చింతలు తీర్చిన ఉప ముఖ్యమంత్రి
-అడిగిన వెంటనే గిరిజనులకు అభివృద్ధి వరాలు -‘మాటా-మంతి’లో వచ్చిన సమస్యలకు తక్షణ పరిష్కారాలు -సుమారు రూ. 5 కోట్లతో పాఠశాలలు, ఆసుపత్రులు తదితర అభివృద్ధి పనులకు మంజూరు -కాకవాడ–వేములకొండ అడవి తల్లి బాట రహదారికి శంకుస్థాపన అనంతరం గిరిజనులతో పవన్ కళ్యాణ్ మాటా-మంతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: అడవి బిడ్డల కష్టాలు తెలుసుకునేందుకు అరణ్యం మధ్యలోని గిరిశిఖర గ్రామానికి వెళ్లారు. సుమారు 350 మంది జనాభా కలిగిన రాకోట గ్రామాన్ని సందర్శించి, గిరిజనుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చింత చెట్టు కింద …
Read More »రూ.1,944.43 కోట్ల నిధుల విడుదల కనిపించదా జగన్?
– 1,50,747 మంది రైతుల నుంచి 2,84,045.60 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తుల కొనుగోళ్లు – అధికారిక లెక్కలను దాచిపెట్టి కూటమి ప్రభుత్వంపై జగన్ , సాక్షి విషప్రచారం – ఆగస్టు 17నే ఖరీఫ్ కొనుగోళ్ల ప్రతిపాదన.. సెప్టెంబరు 23న కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ లేఖ – సకాలంలో చెల్లింపుల కోసం 15 శాతం రివాల్వింగ్ ఫండ్, రూ.300 కోట్ల ఆర్థిక సహాయం ప్రతిపాదన – రైతుల పేరుతో రాజకీయాలు మానాలి.. వాస్తవాలపై జగన్ బహిరంగ చర్చకు రావాలి – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు …
Read More »విజయవాడలో అట్టహాసంగా ‘జాతీయ సరస్ ఆజీవిక మేళా–2026’
– అక్టోబర్ 13 నుంచి పున్నమి ఘాట్లో ప్రారంభం – నవరాత్రి శోభతో పాటు గ్రామీణ మహిళా శక్తికి వేదికగా సరస్ మేళా – 576 స్టాళ్లతో అద్భుత ఏర్పాట్లు – స్వయం ఏపీ బ్రాండ్ అమ్మకాలకు సువర్ణావకాశం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: దేశవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులు, గ్రామీణ కళాకారులు, పారిశ్రామికవేత్తల అద్భుతమైన ఉత్పత్తులకు జాతీయస్థాయిలో గొప్ప మార్కెటింగ్ వేదికగా ‘ జాతీయ సరస్ ఆజీవిక మేళా–2026 ‘ నిలుస్తోందని …
Read More »విజయవంతంగా ముగిసిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ 3 రోజుల స్పెయిన్ పర్యటన
-ఏపీ పర్యాటకరంగానికి గ్లోబల్ గుర్తింపు లభించేలా మంత్రి దుర్గేష్ ప్రత్యేక కృషి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మూడు రోజుల స్పెయిన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పునరుద్ధరించడానికి, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి, నూతన సాంకేతికతలను ప్రవేశపెట్టడానికి మంత్రి దుర్గేష్ ఈ పర్యటనలో చేసిన కృషి విశేష ప్రశంసలు పొందింది.స్పెయిన్లోని సెవిల్లె నగరంలో జరిగిన ప్రతిష్టాత్మక ‘టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్-2026’ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి కందుల దుర్గేష్ …
Read More »ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక… : కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: అక్టోబర్ 12వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లను పరిశీలించిన బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్
-తొలిరోజు బాలా త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుని, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఇంద్రకీలాద్రిపై శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ తొలిరోజు బాలా త్రిపుర సుందరి అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. రైతులు, యువత, మహిళలు, పేదలు సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని …
Read More »తెలంగాణ ఆర్టీసీ ఎన్నికల్లో ఇ.యు. ఘన విజయం
-కార్మికుల విశ్వాసానికి నిదర్శనం: ఏపీ ఇ.యు. నేతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఎంప్లాయీస్ యూనియన్ (ఇ.యు.) కూటమి సాధించిన ఘన విజయంపై ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఇ.యు. రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జి.వి. నరసయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలంగాణ ఇ.యు. నాయకత్వానికి అభినందనలు తెలిపారు. అధికార బలం కంటే కార్మికుల విశ్వాసమే గొప్పదని ఎన్నికల …
Read More »ప్రశాంతంగా స్పెషల్ టెట్ తొలిరోజు పరీక్షలు
-97 శాతానికిపైగా ఉపాధ్యాయుల హాజరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏపీ స్పెషల్ టెట్–2026 పరీక్షలు తొలిరోజు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 11 నుంచి 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు ఉదయం సెషన్లో 48 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పేపర్–1ఏ తెలుగు పరీక్షకు 9,938 మంది ఉపాధ్యాయులు హాజరు కావాల్సి ఉండగా, 9,707 మంది హాజరయ్యారు. హాజరు శాతం 97.68గా నమోదైంది. మధ్యాహ్నం సెషన్లో 54 పరీక్షా కేంద్రాల్లో …
Read More »
Prajavartha Online Telugu News