Breaking News

ప్రశాంతంగా స్పెషల్‌ టెట్‌ తొలిరోజు పరీక్షలు

-97 శాతానికిపైగా ఉపాధ్యాయుల హాజరు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏపీ స్పెషల్‌ టెట్‌–2026 పరీక్షలు తొలిరోజు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబరు 11 నుంచి 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు ఉదయం సెషన్‌లో 48 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పేపర్‌–1ఏ తెలుగు పరీక్షకు 9,938 మంది ఉపాధ్యాయులు హాజరు కావాల్సి ఉండగా, 9,707 మంది హాజరయ్యారు. హాజరు శాతం 97.68గా నమోదైంది. మధ్యాహ్నం సెషన్‌లో 54 పరీక్షా కేంద్రాల్లో పేపర్‌–1ఏ తెలుగు, పేపర్‌–1ఏ మైనర్‌ మీడియం, పేపర్‌–1బీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 12,296 మందికి గాను 12,005 మంది హాజరయ్యారు. హాజరు శాతం 97.63గా నమోదైంది. తొలిరోజు రెండు సెషన్లలోనూ ఉపాధ్యాయుల హాజరు 97 శాతానికి పైగా నమోదైంది. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఏపీ-తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు-విజయ్ భేటీ

-గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ -చెన్నై తాగునీటి అవసరాలు తీర్చాలని కోరిన తమిళనాడు సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: …