Breaking News

ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లను పరిశీలించిన బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్

-తొలిరోజు బాలా త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుని, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఇంద్రకీలాద్రిపై శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ తొలిరోజు బాలా త్రిపుర సుందరి అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. రైతులు, యువత, మహిళలు, పేదలు సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని అమ్మవారిని వేడుకున్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

భక్తుల సౌకర్యాలపై ఆరా…

ఆలయ పరిసరాల్లో భక్తుల కోసం కల్పించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులతో నేరుగా మాట్లాడి, వారు ఏయే ప్రాంతాల నుంచి వచ్చారు, దర్శన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అవసరమైన సౌకర్యాలు అందుతున్నాయా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది భక్తులు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకురావడంతో, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి భక్తులకు తక్షణమే తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. దసరా మహోత్సవాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, తాగునీరు సహా అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణతో పాటు ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ఎంతో ముఖ్యమని, భక్తుల అవసరాలను గుర్తించి తక్షణమే స్పందించడం ద్వారా వారికి మెరుగైన దర్శన అనుభూతిని అందించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఏపీ-తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు-విజయ్ భేటీ

-గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ -చెన్నై తాగునీటి అవసరాలు తీర్చాలని కోరిన తమిళనాడు సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: …