Breaking News

Daily Archives: October 13, 2026

ప్రథమ చికిత్సపై అవగాహన, శిక్షణకు ముందుకు వచ్చిన డాక్టర్ బి.సి. రాయ్ ప్రథమ చికిత్స ప్రదాతల సంఘం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు ప్రథమ చికిత్సపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ బి.సి. రాయ్ ప్రథమ చికిత్స ప్రదాతల సంఘం పిలుపునిస్తోంది. ఈ లక్ష్యంతో దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు, ప్రజలకు ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సి.ఎల్. వెంకటరావు, రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఇమామ్ సాహెబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మకాల …

Read More »

సీఈసీని సాగనంపే వరకూ ఉద్యమిద్దాం, దసరా ఉత్సవాల తర్వాత భారీ నిరసన

-విజయవాడ పౌర సమాజం ఆధ్వర్యంలో ధర్నా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: సామాన్య ప్రజల ఓటుహక్కుని హరిస్తున్న సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను బాధ్యతల నుంచి తొలగించే వరకూ ఉద్యమం ఆగదని విజయవాడ పౌర సమాజం ప్రతినిధి బూర్తి నగేశ్ హెచ్చరించారు. విజయవాడ ధర్నాచౌక్ లో నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. విజయవాడలో దసరా ఉత్సవాల కారణంగా ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదని భారీ నిరసనలను వాయిదా వేసినట్టు తెలిపారు. దసరా అనంతరం భారీ ఉద్యమం విజయవాడలో చేపట్టబోతున్నట్టు ఆయన తెలియజేశారు. సోమవారం ఉదయం జరిగిన …

Read More »

రూ.3,222.12 కోట్లతో తిరుపతి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: తిరుపతి నగరాన్ని ఆధ్యాత్మికత, ఆధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణల సమ్మేళనంగా అభివృద్ధి చేసి, ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన తిరుపతి–తుడా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి వర్చువల్ …

Read More »

తిరుమలలో శ్రీవారికి తిరుపతి కొడై గొడుగుల సమర్పణ కార్యక్రమానికి హాజరైన డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి పవిత్రమైన తిరుపతి కొడై గొడుగులను సమర్పించే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు. తమిళనాడుకు చెందిన వసంత్ బృందం ఆధ్వర్యంలో తిరుమలలో నిర్వహించిన ఈ పవిత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, …

Read More »

కనకదుర్గమ్మవారి దసరా వైభవానికి విజయవాడ ఉత్సవ్ 2.0 ప్రత్యేక ఆకర్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: పున్నమి ఘాట్ వేదికగా నిర్వహించిన ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఛైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంతో పాటు తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు విశేష ప్రాధాన్యతనివ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తూనే, …

Read More »