Breaking News

రూ.3,222.12 కోట్లతో తిరుపతి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
తిరుపతి నగరాన్ని ఆధ్యాత్మికత, ఆధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణల సమ్మేళనంగా అభివృద్ధి చేసి, ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన తిరుపతి–తుడా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి వర్చువల్ విధానంలో తిరుపతి–తుడా ఆధ్వర్యంలో రూ.3,222.12 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. తిరుపతి నగరాన్ని ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కాపాడుకుంటూనే ఆధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
తిరుపతి ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రంగా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించడం ద్వారా తిరుపతిని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు నగర భవిష్యత్తుకు, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు, పర్యాటక రంగ పురోగతికి దోహదపడనున్నాయి.
ఈ సందర్భంగా తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి జేబీ శ్రీనివాస్ తో కలిసి డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, తుడా వైస్ చైర్మన్ ఆర్. గోవిందరావు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే  పులివర్తి నాని, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భాను ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ తదితర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తిరుపతి నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాలు నగర ప్రగతికి కొత్త దిశానిర్దేశం చేయనున్నాయి. ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన తిరుపతిని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దే లక్ష్య సాధనలో ఈ ప్రాజెక్టులు కీలకంగా నిలవనున్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఏపీ-తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు-విజయ్ భేటీ

-గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ -చెన్నై తాగునీటి అవసరాలు తీర్చాలని కోరిన తమిళనాడు సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: …