విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పున్నమి ఘాట్ వేదికగా నిర్వహించిన ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంతో పాటు తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు విశేష ప్రాధాన్యతనివ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తూనే, మన సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం లభించడం రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు.
శ్రీ కనకదుర్గమ్మవారి దసరా మహోత్సవాల వైభవాన్ని ప్రతిబింబించే ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ నగర సాంస్కృతిక గుర్తింపును మరింత పెంచుతుందని పేర్కొన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News