Breaking News

Daily Archives: October 13, 2026

స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం : మస్తాన్ వలీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ ఆరోపించారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఎస్సీ, బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. ఆన్‌లైన్ నామినేషన్ల విధానం ప్రవేశపెట్టాలని, ఛాలెంజ్ ఓటుకు అవకాశం కల్పించాలని, …

Read More »

శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి అలంకరణలో శ్రీ మహంకాళి అమ్మవారు

-దసరా శరన్నవరాత్రుల సందర్భంగా భక్తులకు విశేష దర్శనం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మంగళవారం కంఠంరాజు కొండూరు గ్రామం, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లాలో కొలువై ఉన్న ప్రసిద్ధ అధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీ మహంకాళి అమ్మవారు శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. లోకానికి అన్నాన్ని ప్రసాదించే తల్లిగా పూజలందుకునే శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారి దర్శనం భక్తులను ఆకట్టుకుంది. శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయంలో …

Read More »

విపత్తుల ప్రమాద నివారణ ఇంటి నుంచే ప్రారంభం కావాలి

-రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో అవగాహన సదస్సు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: విపత్తుల వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేందుకు ముందస్తు సంసిద్ధత, అప్రమత్తత ఎంతో అవసరమని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు అన్నారు. అంతర్జాతీయ విపత్తుల ప్రమాద తగ్గింపు దినోత్సవం సందర్భంగా ఆయన అధ్యక్షతన కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డా. ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ, ప్రతి ఇంటిలో ఆహార ధాన్యాలు, తాగునీరు, అవసరమైన మందులు, టార్చ్‌లైట్లు, బ్యాటరీలు, రేడియో వంటి అత్యవసర వస్తువులను …

Read More »

భక్తులకు సేవే దైవసేవ.. ఇంద్రకీలాద్రిపై మానవతా పరిమళం

-మంచినీరు, మజ్జిగ పంపిణీ.. పసిపిల్లలకు వేడి పాలు.. సేవలో భాగస్వాములైన స్వచ్ఛంద సంస్థలు, యువ వాలంటీర్లు ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో ఇంద్రకీలాద్రి భక్తి పారవశ్యంలో మునిగితేలుతుండగా, అమ్మవారి దర్శనానికి తరలివస్తున్న భక్తులకు అందుతున్న సేవలు మానవతా విలువలను చాటుతున్నాయి. ఎండ, రద్దీతో ఇబ్బంది పడకుండా భక్తులకు మంచినీరు, మజ్జిగ అందించడంతో పాటు, పసిపిల్లల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వేడి పాలు కూడా పంపిణీ చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, NSS యువ వాలంటీర్లు, రెడ్‌క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ …

Read More »

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, పురపాలక శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరగాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు మాత్రమే ప్రతి అంశాన్ని అమలు చేయాలని అన్నారు. …

Read More »

కనకదుర్గమ్మకు ద్వారకాతిరుమల శ్రీవారి సారె సమర్పణ

-రెండు పుణ్యక్షేత్రాల మధ్య ఆధ్యాత్మిక అనుబంధానికి ప్రతీక ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల పవిత్ర వేళ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మకు ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం తరఫున సారె తీసుకువచ్చారు. శ్రీవారి క్షేత్రం నుంచి జగన్మాతకు సారె సమర్పించడం రెండు పుణ్యక్షేత్రాల మధ్య ఆధ్యాత్మిక అనుబంధాన్ని, భక్తి సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పే విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ద్వారకాతిరుమల దేవస్థానం చైర్మన్ సూరనేని వెంకట నివృతరావు సహా సిబ్బంది h సిబ్బంది దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. …

Read More »

శ్రీ కనక ​దుర్గమ్మను దర్శించుకున్న సినీ దర్శకుడు బోయపాటి శ్రీను

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను కుటుంబ సమేతంగా మంగళవారం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల పవిత్ర వేళ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న జగన్మాతను దర్శించుకుని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. అమ్మవారి దివ్యమంగళ రూపం, ఆలయంలోని భక్తిపూర్వక వాతావరణం దర్శనానికి ప్రత్యేక శోభను చేకూర్చాయి. దర్శనం అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడుతూ ఒకప్పుడు దసరా పండుగ అంటే మైసూర్ గుర్తుకు వచ్చేదన్నారు. ప్రస్తుతం అదే స్థాయిలో విజయవాడ నగరంలో జరుగుతున్న విజయవాడ …

Read More »

మెప్మా అధికారులకు ఆర్టీఐపై ప్రత్యేక శిక్షణ

-పాలనలో పారదర్శకత, జవాబుదారీతనమే లక్ష్యం తాడేపల్లి, అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: సమాచార హక్కు చట్టం–2005 అమలుపై అవగాహన పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మెప్మా (MEPMA) ప్రాజెక్టు డైరెక్టర్లు, ప్రజా సమాచార అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మెప్మా మిషన్ డైరెక్టర్ జి. బాలకృష్ణ ఐఏఎస్ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ శిక్షణ తరగతులు నిర్వహించారు. అక్టోబర్ 5 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన శిక్షణలో భాగంగా సోమవారం ముగింపు సెషన్‌లో గుంటూరు జిల్లా శిక్షణ కేంద్రం రిసోర్స్ పర్సన్ …

Read More »

అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ

-అన్నమే పరబ్రహ్మం.. ఆకలి తీర్చడమే మహోన్నత సేవ… ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణాదేవి అలంకారం అన్నదాన ప్రాముఖ్యతను, సమస్త జీవుల పట్ల అమ్మవారి కరుణను చాటిచెబుతుంది. హిందూ సంప్రదాయంలో అన్నపూర్ణాదేవిని అన్నానికి అధిదేవతగా, సమస్త జీవులకు ఆహారాన్ని ప్రసాదించే తల్లిగా ఆరాధిస్తారు. ఆకలి తీర్చడం కేవలం శారీరక అవసరాన్ని తీర్చడమే కాకుండా, మానవత్వాన్ని చాటే పవిత్రమైన సేవగా భావిస్తారు. అన్నం జీవనాధారం కాగా, …

Read More »

శ్రీవిద్యాంజలి హైస్కూల్ విద్యార్థులకు ప్రథమ చికిత్సపై అవగాహన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: శ్రీవిద్యాంజలి హైస్కూల్ విద్యార్థులకు వివిధ ఆరోగ్య సమస్యలు, వాటి నివారణ చర్యలు, ప్రథమ చికిత్స విధానాలపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ పుప్పాల శ్రీనివాసరావు వివరాల ప్రకారం, డాక్టర్ మాకాల సత్యనారాయణ విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. డాక్టర్ రాయ్ ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని వివిధ విద్యాసంస్థల్లో ఇటువంటి అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు సంస్థ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. గుండెపోటు, జలుబు, దగ్గు, ఆయాసం, జ్వరం, …

Read More »