Breaking News

శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి అలంకరణలో శ్రీ మహంకాళి అమ్మవారు

-దసరా శరన్నవరాత్రుల సందర్భంగా భక్తులకు విశేష దర్శనం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మంగళవారం కంఠంరాజు కొండూరు గ్రామం, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లాలో కొలువై ఉన్న ప్రసిద్ధ అధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీ మహంకాళి అమ్మవారు శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. లోకానికి అన్నాన్ని ప్రసాదించే తల్లిగా పూజలందుకునే శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారి దర్శనం భక్తులను ఆకట్టుకుంది. శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఏపీ-తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు-విజయ్ భేటీ

-గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ -చెన్నై తాగునీటి అవసరాలు తీర్చాలని కోరిన తమిళనాడు సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: …