Breaking News

మెప్మా అధికారులకు ఆర్టీఐపై ప్రత్యేక శిక్షణ

-పాలనలో పారదర్శకత, జవాబుదారీతనమే లక్ష్యం

తాడేపల్లి, అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
సమాచార హక్కు చట్టం–2005 అమలుపై అవగాహన పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మెప్మా (MEPMA) ప్రాజెక్టు డైరెక్టర్లు, ప్రజా సమాచార అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మెప్మా మిషన్ డైరెక్టర్ జి. బాలకృష్ణ ఐఏఎస్ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ శిక్షణ తరగతులు నిర్వహించారు. అక్టోబర్ 5 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన శిక్షణలో భాగంగా సోమవారం ముగింపు సెషన్‌లో గుంటూరు జిల్లా శిక్షణ కేంద్రం రిసోర్స్ పర్సన్ ఇమ్మాన్యూయెల్ అధికారులకు ఆర్టీఐ చట్టంలోని నిబంధనలు, ప్రజా సమాచార అధికారుల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. సమాచార దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించడం, ప్రభుత్వ రికార్డులను పటిష్ఠంగా నిర్వహించడం వంటి అంశాలను వివరించారు. ప్రజలకు ప్రభుత్వ సమాచారాన్ని సకాలంలో అందించడం ద్వారా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థల పరిధిలో సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ మిషన్ డైరెక్టర్ కే.ఎన్. వెంకటేశ్వరరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉషాకిరణ్, ఏడీ కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఏపీ-తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు-విజయ్ భేటీ

-గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ -చెన్నై తాగునీటి అవసరాలు తీర్చాలని కోరిన తమిళనాడు సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: …