Breaking News

శ్రీవిద్యాంజలి హైస్కూల్ విద్యార్థులకు ప్రథమ చికిత్సపై అవగాహన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
శ్రీవిద్యాంజలి హైస్కూల్ విద్యార్థులకు వివిధ ఆరోగ్య సమస్యలు, వాటి నివారణ చర్యలు, ప్రథమ చికిత్స విధానాలపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ పుప్పాల శ్రీనివాసరావు వివరాల ప్రకారం, డాక్టర్ మాకాల సత్యనారాయణ విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. డాక్టర్ రాయ్ ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని వివిధ విద్యాసంస్థల్లో ఇటువంటి అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు సంస్థ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. గుండెపోటు, జలుబు, దగ్గు, ఆయాసం, జ్వరం, పాముకాటు వంటి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స పద్ధతులను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మోడీ హెల్త్ స్టిక్‌లను అందజేసి, వాటి వినియోగం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బి. ఉదయ్ కుమార్, కె. పవన్ కళ్యాణ్, కె. దుర్గాప్రసాద్, తవ్వా కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఏపీ-తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు-విజయ్ భేటీ

-గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ -చెన్నై తాగునీటి అవసరాలు తీర్చాలని కోరిన తమిళనాడు సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: …