-రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం
-దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు
-ప్రజాస్వామ్యానికి, ఓటు హక్కుకు విఘాతం కలిగించేలా ఉంది
-రాష్ట్రంలో లక్షలాది ఓట్లను ఏకపక్షంగా తొలగించారు
-ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతకు తూట్లు
-2023 ఈసీ నియామక చట్టాన్ని పునఃసమీక్షించాలి
-ఎంపిక కమిటీలో సీజేఐని పునరుద్ధరిస్తూ చట్టసవరణ చేయాలి
-ఈసీఐనెట్, ఈఆర్ఓనెట్ లోపాలను బయటపెట్టాలి
-ఆర్డబ్ల్యూఈ, పారదర్శక ఓటర్ల సవరణ ప్రక్రియే ప్రజాస్వామ్యానికి రక్షణ
-మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జాతీయ స్థాయిలో ఎన్నికల కమీషన్ను ప్రక్షాళన చేయాలని మొట్టమొదటిగా స్పందించిన పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని, ఆ రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. శనివారం విజయవాడలో మల్లాది విష్ణు ఇంటి వద్ద పోలీసులు నిర్బంధించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల సంఘం అవకతవకలు, ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఓట్లను ఏకపక్షంగా తొలగించడం వంటి అంశాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో దాదాపు 60 లక్షలకు పైగా, దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్ల వరకు తొలగించడం జరిగిందని తెలిపారు. ఏ రకంగా స్వతంత్రంగా నిర్ణయాలు చేస్తారు జేకబ్ అభిప్రాయం లేకుండా, 2023లో చేసిన చట్టాన్ని పునఃసమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి చేత నామినేట్ చేయబడే వారి ఇంటర్ఫరెన్స్ మూలంగా, చీఫ్ జస్టిస్ను పక్కన పెట్టేలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో ఓటు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల, పౌరుల ఓటు హక్కును పరిరక్షించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడం, నిర్బంధించడం వంటి చర్యలు సరికాదన్నారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఫలితాలు దేశాన్నే ఆశ్చర్యానికి గురిచేశాయని, ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత టెక్నికల్ పర్సన్స్, మేధావులు, రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యక్తులు మాట్లాడిన మాటల ప్రకారం 2014 ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగలేదని, ఈవీఎంల ప్రభావం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కనబడిందని విష్ణు గుర్తుచేశారు. బ్యాలెట్ పద్ధతి కావాలని, ఈవీఎంలు అవసరం లేదనేదే తమ ప్రధాన పోరాటమని ఆయన పునరుద్ఘాటించారు. సీజేఐని తొలగించడం ప్రజాస్వామ్యానికి చేటు ముఖ్యంగా ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టాన్ని తక్షణమే పునఃసమీక్షించాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. గతంలో సుప్రీంకోర్టు సూచించిన విధంగా ప్రధానమంత్రి, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి లతో కూడిన త్రైసభ్య ఎంపిక కమిటీ విధానాన్ని పునరుద్ధరించేలా చట్టసవరణ చేయాలి…సీజేఐని కమిటీ నుంచి తప్పించి, కేంద్ర కేబినెట్ మంత్రిని చేర్చడం ద్వారా ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం తన గుప్పిట్లోకి తెచ్చుకునే కుట్ర చేస్తోంది అని మండిపడ్డారు. ఆ 14 అభ్యంతరాలపై ఈసీ సమాధానమేది గతంలో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు స్వయంగా వ్యక్తం చేసిన 14 కీలక అభ్యంతరాలపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలేమిటో వెంటనే బహిరంగపరచాలని విష్ణు డిమాండ్ చేశారు. అలాగే ఓటర్ల చేర్పులకు సంబంధించిన ఫారం 6 మార్పుల వ్యవహారంలో చట్టబద్ధమైన నిబంధనలు, ప్రక్రియలను అసలు అనుసరించారా లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఈసీఐనెట్, ఈఆర్ఓనెట్ వ్యవస్థలను సమీక్షించాలి సాంకేతిక వ్యవస్థలైన ఈ.సి.ఐ నెట్, ఈ.ఆర్.వో నెట్ నిర్వహణపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయని, వాటిపై పూర్తిస్థాయి సమీక్ష జరిపి ఫలితాలను ప్రజల ముందుంచాలని కోరారు. ఓటర్ల పేర్ల చేర్పులు, తొలగింపులు, పునరుద్ధరణ ప్రక్రియలన్నింటినీ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులైన ఏ ఒక్క పౌరుడూ ఓటు హక్కు కోల్పోకుండా గట్టి రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై అనేక వినతులు, అభ్యంతరాలు వచ్చాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించిన తర్వాతే తుది ఓటర్ల జాబితాను విడుదల చేయాలని విష్ణు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. ఎన్నికల నిర్వహణలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కల్పించాలని, కూటమి ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రభుత్వ యంత్రాంగం కేవలం నిష్పక్షపాతంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని మల్లాది విష్ణు స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News