-కలెక్టర్ కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం కింద జిల్లాలో ఎంపిక చేసిన 272 గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వీడియో కాన్ఫరెన్స్ లో సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ కి జిల్లా కలెక్టర్ డా.కె.మాధవిలత వివరించారు. గురువారం విజయవాడ సిసిఎల్ఏ కార్యాలయం నుండి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం, ఇతర అంశాలపై కలెక్టర్ లు, జాయింట్ కలెక్టర్లతో సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాధవిలత పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News