Breaking News

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ లు అందచేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధ పడుతున్న వారికి ఎమ్మెల్యే సుజనా చౌదరి సీఎం సహాయ నిధికి లేఖలు రాసారు.. నియోజకవర్గానికి చెందిన వేముపాటి విజయలక్ష్మి కి వెన్ను సర్జరీ కోసం 2,24,000/- రూపాయలు, కొల్లిపర వెంకట పద్మావతి తుంటి మార్పిడి చికిత్సకు 7,00,000/- రూపాయలు, పబ్బిశెట్టి శ్రీనివాస్ గుండె శస్త్ర చికిత్సకు 5,00,000/- రూపాయలు, వడ్లమూడి శ్రీనివాస్ కు 2,00,000/- రూపాయలు, దమ్ము జయ కు 65,000/- రూపాయలకు ఎల్వోసీ లు అందచేశారు.. మంగళవారం ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో బాధితుల కుటుంబ సభ్యులకు ఎల్వోసీ లు అంద చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుర్రంకొండ, ఈగల సాంబశివరావు, అమరా గోపాలకృష్ణ, ధనాల శ్రీనివాసరావు, 45వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు బొమ్ము రాంబాబు , ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, సుజనా మిత్ర లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *